భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!

Business: Grandmother Earns Rs 11 Lakhs Per Month From Dairy Farm - Sakshi

సాధారణంగా వయసు మీద పడే కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు. వృద్ధాప్యం కారణంగా ఆ వయసులో వచ్చే మోకాళ్లు, నడుము నొప్పులు వారిని తెగ ఇబ్బంది పెడుతంటాయి. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఓ బామ్మ మాత్రం తాను కాస్త డిఫెరెంట్‌ అంటోంది. 65 ఏళ్లు దాటిన కూడా వ్యాపారం చేస్తూ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. యుక్త వయస్కురాలు చేసినట్లు అన్ని పనులు చేస్తోంది. అసలు ఈ బామ్మ ఎవరు..? ఆ వ్యాపారం ఏంటో అనే వివరాలను తెలుసుకుందాం.

ఆ ఆలోచనే.. లక్షల సంపాదనగా మారింది 
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్‌బీన్ దల్‌సంభాయ్ చౌదరి (65). ఈ బామ్మ పెద్దగా చదువుకోలేదు. వయసులో ఉన్నప్పుడు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ, వయసు అయ్యే కొద్దీ కూలి పని కష్టంగా మారింది. ఇక ఏం పనులు చేసుకోగలం అని ఆలోచించగా ఓ ఐడియా తట్టింది.  అదే పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది వేసింది.

అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి. ప్రస్తుతం రోజూ 11 వందల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారా ప్రతి నెలా ఆమె 11 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. నవాల్‌బీన్ ఏడాదికి 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

ఆమె నడుపుతున్న డెయిరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ. లక్షన్నర. మహిళా సాధికారతకు నవాల్బీన్ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా పాల వ్యాపారం విజయవంతంగా సాగిస్తున్న ఈ బామ్మను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

చదవండి: సిబిల్‌ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top