బీటెక్‌ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్‌ పానీపూరి

Btech Pani Puri Wali Girl Selling Pani Puri On Bullet - Sakshi

ఈ మధ్య చదువులకు, చేసే పనికి సంబంధం ఉండటం లేదు. డిగ్రీలున్నా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి చూసుకుంటుంటే మరికొందరు మాత్రం డిగ్రీ చేసినా ప్రత్యేకమైన లక్ష్యంతో చిరువ్యాపారాల బాట పడుతున్నారు.

21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా ప్రసిద్ధి చెందారు. బుల్లెట్‌ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై ఆమె పానీపూరీలను విక్రయిస్తున్నారు. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు.  ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. (జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?)

ఇదీ చదవండి: టాప్‌ సీక్రెట్‌ చెప్పిన గూగుల్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌... ఇది ఉంటే జాబ్‌ పక్కా!

తాజాగా ఆమె బుల్లెట్‌ వాహనానికి పానీపూరి బండిని కట్టుకుని తీసుకెళ్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. అంత చదువు చదువుకుని ఇలా పానీపూరీ అమ్ముకుంటున్నావేంటి అని చాలా మంది ప్రశ్నించారని, కొందరైతే  భద్రంగా ఉండాలంటే ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారని తాప్సీ చెప్పారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు మూడు లక్షల లైక్‌లు వచ్చాయి. ఆ యువతి స్ఫూర్తిని అభినందిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top