టాప్‌ సీక్రెట్‌ చెప్పిన గూగుల్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌... ఇది ఉంటే జాబ్‌ పక్కా!

Google Ex Vice President Shares Top Skill For In Job Interviews - Sakshi

టెక్‌ కంపెనీల్లో లేఆఫ్స్‌ల కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారి తొలగింపు కథనాలు,  కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారితో లింక్డ్‌ఇన్ వంటి సామాజిక వేదికలు నిండిపోయాయి.  కొంతమంది ఇప్పటికే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోగా మరికొందరు ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూ, మంచి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే మంచి నైపుణ్యాలు కావాలి.

 

ఇంటర్వ్యూల్లో చూసేది ఇదే..
ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లైర్ హ్యూస్ జాన్సన్ టాప్‌ సీక్రెట్‌ చెప్పారు. ఉద్యోగ ఇంటర్వ్యూలో రిక్రూటర్లు అభ్యర్థులలో ఆశించే  టాప్‌ స్కిల్‌ ఏంటో ఆమె బయటపెట్టారంటూ సీఎన్‌బీసీ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఓ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు అభ్యర్థుల్లో రిక్రూటర్‌లు చూసే అత్యుత్తమ నైపుణ్యం స్వీయ అవగాహన (సెల్ఫ్‌ అవేర్‌నెస్‌).

ఇదీ చదవండి: గూగుల్‌ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఈసారి ఆ భాగ్యం కొందరికే!  

క్లైర్.. గూగుల్‌లో తన పదేళ్ల సుదీర్ఘ అనుభవంలో ఉద్యోగ ఇంటర్వ్యూలో అభ్యర్థులు స్వీయ-అవగాహన ఎంత మేరకు కలిగి ఉన్నారో చేసేవారు. దాని ఆధారంగానే ఉద్యోగానికి ఎంపిక చేసేవారు. వారంలో 40 గంటలు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించడానికే ఆమె వెచ్చించేవారు. ఈ సమయంలో తాను అభ్యర్థులలో అన్నింటికంటే ముందు చూసే ఒక నైపుణ్యం స్వీయ-అవగాహన అని ఆమె పేర్కొన్నారు. పని అనుభవం, ఇతర నైపుణ్యాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, వాటిని నిదానంగా తెలుసుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!

క్లైర్ మాటల ప్రకారం.. ఇలా స్వీయ అవగాహన కలిగి ఉన్న వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరింత ఉత్సాహం చూపుతారు. చేయాల్సిన పని గురించి నిజాయితీగా ఉంటారు.  సహోద్యోగులు, ఉన్నతోద్యోగులతో మెరుగైన సంబంధం కలిగి ఉంటారు. స్వీయ-అవగాహన అనేది ఒక 'అరుదైన' లక్షణం. ఓ పరిశోధన ప్రకారం.. 95 శాతం మంది అభ్యర్థులు తమకు స్వీయ-అవగాహన ఉందని భావిస్తారు. కానీ వాస్తవానికి 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top