‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్‌కు పోతారు’ | Sakshi
Sakshi News home page

‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్‌కు పోతారు’

Published Sun, Feb 4 2024 3:16 PM

British workers hardly work they go to pub apollo tyres head - Sakshi

యూకేలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై అపోలో టైర్స్ అధిపతి నీరజ్ కన్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టనే పెట్టబోమని, అక్కడి వర్కర్లు పనిచేయకుండా పబ్‌లకు వెళ్తారని ఆరోపించారు. అందులోనూ అక్కడి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని నీరజ్‌ కన్వర్‌ వ్యాఖ్యానించినట్లు ‘డైలీ మెయిల్‌’ కథనం పేర్కొంది. 

ఇదే సమయంలో ఇతర దేశాలు ఇచ్చిన ప్రోత్సాహకాలను హైలైట్ చేస్తూ "హంగేరీ మాకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఇక్కడ కార్మికుల ఖర్చు చాలా అందుబాటులోనే ఉంది. దీంతో ఉత్పత్తి ఖర్చు తక్కువే అవుతుంది.  ఇక యూకేలో శ్రామిక శక్తి ఎలా ఉందో మీకు తెలుసు. వీళ్లు పెద్దగా పనిచేయకుండా పబ్‌లకు వెళ్తుంటారు" అని అపోలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్‌ కన్వర్‌ వ్యాఖ్యానించారు.

ఇది అక్కడ విధానపరమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజలు పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్నారని నిందించారు. లండన్‌లో ఇటాలియన్ రెస్టారెంట్‌ కూడా ఉన్న కన్వర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ యూకేలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.

అపోలో టైర్స్‌ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే యూకేలో కార్పొరేట్‌ వ్యవహారాలను నిర్వహించడానికి 30 మంది సభ్యుల టీమ్‌ ఉంది. ఇక్కడే ఈ కంపెనీకి ఇన్నోవేషన్‌ హబ్‌ ఉండటం గమనార్హం. కాగా మరో ఇన్నోవేషన్‌ హబ్‌ భారత్‌లోని హైదరాబాద్‌లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్‌కు ఈ కంపెనీ దీర్ఘకాలిక స్పాన్సర్‌గా కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement