ఎలన్‌ మస్క్‌ వీడియోలు చూస్తున్నారా?

British Army Youtube And Twitter Accounts Hacked Due To Elon Musk Link - Sakshi

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ చెప్పే క్రిప్టో ప్రిడిక్షన్స్‌ నమ్ముతున్నారా? ఆయన పేరు మీదున్న యూట్యూబ్‌ వీడియోలు, ట్విట్‌ లింక్స్‌ ఓపెన్‌ చేస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త. సైబర్‌ నేరస్తులు ఎలన్‌ మస్క్‌ ఫోటోలు, వీడియోలు చూపించి మోసం చేస్తున్నారు.   

సైబర్‌ నేరస్తులు తెలివి మీరారు. ఎలన్‌ మస్క్‌ ఫోటోల్ని, వీడియోల్ని చూపించి అమాయకుల్నే కాదు బ్రిటిష్‌ ఆర్మీని సైతం మోసం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గార్డియన్‌ రిపోర్ట్‌ ప్రకారం.. బ్రిటిష్‌ ఆర్మీకి చెందిన ట్విట్టర్‌ అకౌంట్‌లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్తులు వాటి పేర్లను మార్చారు. పనిలో పనిగా అధికారిక ఆర్మీ ప్రొఫైల్‌ ఇమేజెస్‌కు బదులు మంకీ కార్టూన్‌ ఇమేజ్‌ను అప్‌డేట్‌ చేశారు. ఆర్మీ రిక్రూట్‌ట్మెంట్‌తో పాటు ట్రైనింగ్‌ గురించి అలర్ట్‌ ఇచ్చారు.    

ఇక యూట్యూబ్‌లో సైతం ఎలన్‌ మస్క్‌ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడిన వీడియోల్ని టెలికాస్ట్‌ చేశారు. ఎలన్‌ మస్క్‌ చెప్పినట్లు చేస్తే క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాల్ని గడించవచ్చని నమ్మించారు. దీంతో అప్రమత్తమైన బ్రిటిష్‌ ఆర్మీ దేశ ప్రజలకు క్షమాణలు చెప్పింది. హ్యాకింగ్‌ జరిగిందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం హ్యాకింగ్‌ ఎవరు చేశారు. ఎక్కడి నుంచి చేశారనే అంశంపై బ్రిటిష్‌ ఆర్మీ విచారణ ముమ్మరం చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top