ఆదాయమే మార్గంగా..బీపీసీఎల్‌ రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడులు!

Bpcl Will Invest Rs 1.4 Lakh Crore In Petro Chemicals, City Gas - Sakshi

న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్, పర్యావరణ అనుకూల ఇంధనాల వ్యాపార విభాగాల విస్తరణపై ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే అయిదేళ్లలో రూ. 1.4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. వార్షిక నివేదికలో బీపీసీఎల్‌ సీఎండీ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ ఈ విషయాలు తెలిపారు.

రిస్కులను తగ్గించుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యూహాలను సరి చేసుకుంటున్నామన్నారు. ద్రవ శిలాజ ఇంధనాల వ్యాపారం భవిష్యత్తులో క్షీణిస్తే హెడ్జింగ్‌ కోసం అదనంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలను తీర్చిదిద్దుకుంటున్నామని, వివిధ విభాగాల్లో వ్యాపారాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని సింగ్‌ వివరించారు. 

ఇందుకోసం ఆరు ప్రధాన విభాగాలను (పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, వినియోగ వస్తువుల రిటైలింగ్, ఈ–మొబిలిటీ మొదలైనవి) ఎంపిక చేసుకున్నట్లు ఆయన చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top