వచ్చే ఏడాదిలో మరింత స్పీడ్‌

BPCL, BEML, Shipping Corporation To Be Privatised Next Year - Sakshi

డిజిన్వెస్ట్‌మెంట్‌పై దీపమ్‌ కార్యదర్శి టీకే పాండే

ఎస్‌సీఐ, బీపీసీఎల్, బీఈఎంఎల్‌ ప్రైవేటైజేషన్‌

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను మరింత వేగవంతం చేయనుంది. పీఎస్‌యూ దిగ్గజాలు బీపీసీఎల్, బీఈఎంఎల్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌సీఐ)లలో వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని చేపట్టనున్నట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 65,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రతిపాదించింది.

నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో తొలుత పెట్టుకున్న లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లతో పోలిస్తే తాజా టార్గెట్‌లో భారీగా కోత పడింది. సవరించిన తాజా అంచనాల ప్రకారం మార్చితో ముగియనున్న ఈ ఏడాది రూ. 78,000 కోట్లు సమీకరించగలమని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కాగా.. వచ్చే ఏడాది ఈసీజీసీసహా మూడు పీఎస్‌యూల పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టనున్నట్లు పాండే తెలియజేశారు.  

మైనారిటీ వాటాలు
వచ్చే ఏడాది లక్ష్యాలను చేరేందుకు కొన్ని సీపీఎస్‌ఈలలో మైనారిటీ వాటాలను సైతం విక్రయించనున్నట్లు పాండే వెల్లడించారు. పవన్‌ హంస్‌ కొనుగోలుకి పలు ఫైనాన్షియల్‌ బిడ్స్‌ దాఖలైనట్లు పేర్కొన్నారు. ఇక ఎస్‌సీఐ, బీపీసీఎల్, బీఈఎంఎల్‌.. ఫైనాన్షియల్‌ బిడ్స్‌ దశకు చేరినట్లు తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top