7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్లకు రీకాల్: ఎందుకో తెలుసా? | BMW Recalls Nearly 721,000 Cars And SUVs, Check Out The Reason Inside | Sakshi
Sakshi News home page

7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్లకు రీకాల్: ఎందుకో తెలుసా?

Aug 22 2024 8:52 PM | Updated on Aug 23 2024 2:21 PM

BMW Recalls Nearly 721000 Cars Check The Reason

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సుమారు 7,20,796 యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఈ రీకాల్ ఎంధుకు ప్రకటించింది. దీనికయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

బీఎండబ్ల్యూ కంపెనీ తన కార్లలో వాటర్ పంప్‌లో ఒక లోపభూయిష్ట సీల్‌తో కూడిన సమస్య కారణంగా రీకాల్ ప్రకటించింది. ఈ లోపం కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రీకాల్ జెడ్4 కన్వర్టిబుల్‌తో సహా 2012 నుంచి 2018 మోడల్ సంవత్సరాల వరకు 12 మోడళ్లను ప్రకటించింది. ఇందులో 2,3,4,5 సిరీస్ కార్లు మాత్రమే కాకుండా ఎక్స్1, ఎక్స్3, ఎక్స్4, ఎక్స్5 కార్లు ఉన్నాయి.

ఈ 'రీకాల్'కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే డీలర్‌లకు తెలియజేసింది. కస్టమర్లకు అక్టోబర్ ప్రారంభం నుంచి వెల్లడించే అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించడానికి కస్టమర్లు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే మొత్తం ఖర్చును కంపెనీ భరిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement