BMW : ఎం5 కాంపిటీషన్‌... ఓ‍న్లీ ఆన్‌లైన్‌ బుకింగ్‌ | BMW Introduce BMW M5 Sedan Facelift In India | Sakshi
Sakshi News home page

BMW : ఎం5 కాంపిటీషన్‌... ఓ‍న్లీ ఆన్‌లైన్‌ బుకింగ్‌

Jul 2 2021 9:47 AM | Updated on Jul 2 2021 10:20 AM

BMW Introduce BMW M5 Sedan Facelift In India - Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ ఆధునీకరించిన ఎం5 కాంపిటీషన్‌ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.62 కోట్లు. 4.4 లీటర్‌ వీ8 పెట్రోల్‌ ఇంజన్‌ 625 హెచ్‌పీ పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. 3.3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫీచర్స్‌
ఈ కారులో 6 ఎయిర్‌ బ్యాగ్స్, మిర్రర్‌ క్యాప్స్, లేజర్‌ లైట్స్, ఆటోమేటిక్‌ టెయిల్‌ గేట్, ఫోర్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్, ఎలక్ట్రికల్‌ అడ్జస్టేబుల్‌ సీట్స్, కొత్త షాక్‌ అబ్సార్బర్స్, ట్రాక్‌ మోడ్, సెంట్రలైజ్డ్‌ ఇంటెలిజెంట్‌ కంట్రోల్, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్, డైనమిక్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి హంగులు ఉన్నాయి. కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే ఎం5 కాంపిటీషన్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

చదవండి : సెప్టెంబర్‌ నుంచి బజాజ్‌ ఎలక్ట్రిక్ చేతక్‌ డెలివరీలు

Advertisement
 
Advertisement
Advertisement