క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!

Bitcoin Mining Electronic Waste Growing Threat To Environment Says Study - Sakshi

క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్‌ కరెన్సీ. 2009 నుంచి మొదలైన క్రిప్టోకరెన్సీ  ఇంతింతై వటూడింతై అన్న చందంగా పలు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ విలువ గణనీయంగా పెరుగుతూనే ఉంది. క్రిప్టోకరెన్సీలో అగ్రగణ్యుడు బిట్‌కాయిన్‌ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఆయా క్రిప్టోకరెన్నీలు  పూర్తిగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను,  జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్‌ కార్డులు కచ్చితంగా వాడాలి. కొన్ని రోజుల క్రితం క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ కంప్యూటర్లలో వాడే గ్రాఫిక్స్‌ కార్డు ధరల్లో మార్పులు వచ్చేలా చేశాయి.   అత్యంత బలమైన కంప్యూటర్లతో సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. తాజాగా క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ చేయడంపై విస్తుపోయే విషయాలను ఒక నివేదిక వెల్లడించింది.   
చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..!

పొంచి ఉన్న పెనుముప్పు...!
బిట్‌కాయిన్‌ ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్‌ చేయడంతో గణనీయమైన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఒక సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఎలక్ట్రనిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం 1.3 సంవత్సరాలు మాత్రమే. డచ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎకనామిస్ట్‌, రిపోర్ట్‌ సహ రచయిత అలెక్స్ డి వ్రీస్ మాట్లాడుతూ... ఐఫోన్‌ వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతో పోలీస్తే బిట్‌కాయిన్‌ మైనింగ్‌ నుంచి వచ్చే ఎలక్ట్రినిక్‌ ఉద్గారాల సంఖ్య చాలా తక్కువ.

బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ద్వారా గడిచిన పన్నెండు నెలల్లో ఉత్పత్తి చేయబడిన వ్యర్థాల మొత్తం 30,700 టన్నులు. ఈ మొత్తం నెదర్లాండ్స్‌ లాంటి దేశాల ఎలక్ట్రనిక్‌ వ్యర్థాలకు సమానమని తెలియజేశారు. రానున్న రోజుల్లో బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీల మార్కెట్‌ భారీగా పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు,  స్టోరేజ్ విషయంలో క్రిప్టోకరెన్సీలను మైనింగ్‌ చేయడం కచ్చితం. దీంతో విపరీతంగా కంప్యూటర్ల వాడకం పెరగడంతో ఎలక్ట్రానిక్స్‌ ఉద్గారాలు అనులోమనుపాతంలో పెరుగుతాయని రిపోర్ట్‌ సహ రచయిత అలెక్స్‌ డి వ్రీస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 53.6 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్‌ ఉద్గారాలు వెలువడ్డాయి. 
చదవండి: Bitcoin: ఆ నిర్ణయం బిట్‌కాయిన్‌ కొంపముంచింది..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top