Bitcoin: ఆ నిర్ణయం బిట్‌కాయిన్‌ కొంపముంచింది..!

Bitcoin Crashes On First Day As El Salvador Legal Tender - Sakshi

గత కొన్ని రోజుల క్రితం నేల చూపులు చూసిన క్రిప్టోకరెన్సీ ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటుంది. బిట్‌కాయిన్‌తో పాటు ఈథిరియం, డాగీకాయిన్‌, వంటి ఇతర క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో నేలచూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి ఎల్‌సాల్వాడార్‌, పరాగ్వే దేశాలు తీసుకున్న నిర్ణయాలు కాస్త ఉపశమానాన్ని కల్గించాయి. తాజాగా  బిట్‌కాయిన్‌ క్రిప్టోకరెన్సీకు ఎల్‌సాల్వాడార్‌ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌ను లీగల్‌ టెండర్‌గా గుర్తిస్తామనీ ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.
చదవండి: Afghanistan: అఫ్గన్‌ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..!

ఎల్‌సాల్వాడార్‌ ప్రభుత్వం బిట్‌కాయిన్‌ను లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్‌ పౌరులకు 30 డాలర్ల విలువ గల బిట్‌కాయిన్లను అందించింది. ఎల్‌సాల్వాడర్‌ ప్రభుత్వం సుమారు 550 బిట్‌కాయిన్లను కలిగి ఉంది.  ఈ బిట్‌కాయిన్స్‌ సుమారు 26 మిలియన్‌ డాలర్లతో సమానం.  బిట్‌కాయిన్‌ను స్వీకరించడంతో సుమారు 400 మిలియన్‌ డాలర్ల లావాదేవీలు ఇతర దేశాలనుంచి వచ్చే అవకాశం ఉందని  ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయపడింది. 

ఇష్టంగా లేని ఎల్‌సాల్వాడర్‌ పౌరులు..!
మరోవైపు  బిట్‌కాయిన్‌ను లీగల్‌ టెండర్‌గా గుర్తించినందుకు ఆ దేశ పౌరుల నుంచి తీవ్రమైన నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. బిట్‌కాయిన్‌ మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ సాల్వడార్ ప్రజలు బిట్‌కాయిన్‌ను స్వీకరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎల్ సాల్వడార్‌లో ఉన్న యూనివర్సిటీడ్ సెంట్రోఅమెరికానా జోస్ సిమెన్ కనాస్ అనే జేసూట్ కాలేజీ ఇటీవల నిర్వహించిన పోల్‌లో, 67.9 శాతం మంది పౌరులు బిట్‌కాయిన్‌ను చట్టపరమైన కరెన్సీగా ఉపయోగించడాన్ని అంగీకరించలేదు.  

నిరసనలతో భారీగా పతనం..
ఎల్‌ సాల్వడార్‌ కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణంతో బిట్‌కాయిన్‌ విలువ ఒక్కసారిగా పడిపోయింది. సెప్టెంబర్‌ ఆరో తేదిన బిట్‌కాయిన్‌ ఏకంగా ఒక నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. 52 వేల డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్న బిట్‌కాయిన్‌ ఏకంగా 42 వేల డాలర్లకు పడిపోయింది. కాగా బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది స్వీకరించేందుకుగాను బిట్‌కాయిన్‌ ట్రేడర్స్‌ ఈ క్రిప్టోకరెన్సీ విలువను తగ్గించి ఉంటారని ఊహగానాలు వస్తోన్నాయి. 
చదవండి: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో చెప్పిన ఎలన్‌ మస్క్‌...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top