Jack Ma: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా వ్యాపార దిగ్గజం

Billionaire Jack Ma Will Give Up Control Of Chinese Fintech Giant Ant Group  - Sakshi

చైనా ఫిన్‌ టెక్‌ దిగ్గజం యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై యాంట్‌ గ్రూప్‌ను నియంత్రించే అధికారాన్ని వదులుకోనున్నారు. ఫిన్‌టెక్‌ కంపెనీలో ఉన్న వాటాలను షేర్‌ హోల్డర్లకు సర్దుబాటు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా వాటాలను షేర్ హోల్డర్లకు వాటాలను సర్దుబాటు చేసిన తర్వాత ఏ షేర్‌ హోల్డర్‌ సింగిల్‌గా లేదంటే ఇతర వ్యక్తులతో జత కలిసి యాంట్‌ గ్రూప్‌ని నియంత్రణ చేయలేరంటూ ఓ ప్రకటనలో తెలిపింది. 

జాక్‌ మా విమర్శలు..ఐపీవోకి వెళ్లకుండా అడ్డంకి
యాంట్‌ గ్రూప్‌లో ఈకామర్స్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు మూడో వంతు వాటా ఉంది. అయితే 2020లో 37 బిలియన్‌ డాలర్ల అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులపై జాక్‌మా విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా ప్రభుత్వ అధికారులు యాంట్‌ గ్రూప్‌ పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 

షాంఘై స్టాక్‌ ఎక్స్ఛేంజీ తొలుత యాంట్‌ గ్రూప్‌ లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా..తదుపరి హాంకాంగ్‌ మార్కెట్‌ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వెరసి 37 బిలియన్‌ డాలర్ల అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూకి తాత్కాలికంగా చెక్‌ పడింది.

చైనా బ్యాంకులా.. పాన్‌ షాపులా
గతంలో సంస్థల్ని నియంత్రించే రెగ్యులేటర్లు ఇన్నోవేషన్‌ను అరికడుతున్నాయని జాక్‌ మా విమర్శించారు. దీంతో పాటు గ్లోబల్ బ్యాంకింగ్ నియమాలను తోలుబొమ్మలతో పోల్చారు. చైనాలో పటిష్టమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ లేదని, చైనీస్ బ్యాంకులు పాన్ షాప్‌లు లాంటివని అంటూ చైనా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో రూ.80వేల కోట్ల నష్టం వాటిల్లింది.   

2నెలల్లో రూ.80వేల కోట్ల లాస్‌
2020 చివరి నెలలు బిలియనీర్‌ ‘జాక్‌ మా’కు అంతగా కలిసి రాలేదు. అక్టోబర్‌ చివరి నుంచి, ఏడాది చివరి నాటికి ఆయన సుమారు 11 బిలియన్‌ డాలర్లను నష్టపోయారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.80వేల కోట్లకు పైమాటే.

చైనా ప్రభుత్వం ఊరుకుంటుందా?
అనలిస్టుల అభిప్రాయం ప్రకారం.. యాంట్‌ గ్రూప్‌, జాక్‌ మా సంస్థల విస్తరణను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే జాక్‌ మా తరచూ చైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది కామెంట్లు చేస్తుంటారు. పైగా ఆయన ఎదుగుతున్న తీరుతో తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వ భావిస్తోంది. అందుకే ఇలా చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top