Bhavish Aggarwal Tweet About Next Ola Scooter - Sakshi
Sakshi News home page

Ola electric: ఓలా ప్రియులకు గుడ్ న్యూస్.. భవిష్ అగర్వాల్ ఏం చెబుతున్నాడంటే?

Jun 19 2023 5:30 PM | Updated on Jun 19 2023 7:02 PM

Bhavish aggarwal tweet about next ola scooter - Sakshi

Ola Upcoming Electric Scooter: భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇప్పుడు మార్కెట్లో మరో స్కూటర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్' (Bhavish Aggarwal) తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, వచ్చే నెలలో (2023 జూలై) మరో ఉత్పత్తిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎండ్ఐస్ఏజ్ (#endICEAge) షో పార్ట్ వన్ అని అన్నారు. అయితే త్వరలో వెల్లడించనున్న స్కూటర్ ఏది అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించలేదు.

ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ జాబితాలో మరో స్కూటర్ చేరనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నాము. ఇది కూడా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement