బీపీసీఎల్‌- ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌తో రివార్డ్‌ పాయింట్స్‌ | Bharat Petroleum, SBI Card Launch Co Branded RuPay Credit Card | Sakshi
Sakshi News home page

Credit Card: బీపీసీఎల్‌- ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌తో రివార్డ్‌ పాయింట్స్‌

Sep 24 2021 3:33 PM | Updated on Sep 24 2021 3:35 PM

Bharat Petroleum, SBI Card Launch Co Branded RuPay Credit Card - Sakshi

న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్‌ కంపెనీ బీపీసీఎల్‌.. ఎస్‌బీఐ కార్డ్‌ సంయుక్తంగా రూపే ఆధారిత కాంటాక్ట్‌లెస్‌ క్రెడిట్‌కార్డ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇది కో బ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డ్‌. ఈ కార్డ్‌తో బీపీసీఎల్‌ ఇంధన స్టేషన్లలో చేసే చెల్లింపులపై ప్రత్యేక రివార్డులను వినియోగదారులు పొందొచ్చు.


 బీపీసీఎల్‌ పెట్రోల్‌ స్టేషన్లలో ప్రతీ రూ.100 కొనుగోలుపై 13ఎక్స్‌ రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఒక శాతం ఫ్యుయల్‌ సర్‌చార్జ్‌ను కూడా రద్దు చేశారు. రూ.4,000 వరకు ఉండే లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.  

Advertisement
 
Advertisement
Advertisement