పిల్లల ఎడ్యుకేషన్‌ కోసం పెట్టుబ‌డి పెట్టాల‌ని అనుకుంటున్నారా!

Best Ways To Invest For Your Child Education - Sakshi

నాకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్‌ 

పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్‌ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్‌ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్‌ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్‌ క్యాప్‌ కలిగిన (డైవర్సిఫైడ్‌) కంపెనీల్లో ఫండ్‌ మేనేజర్‌ పెట్టుబడులు పెడతారు.  ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్‌ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్‌ తగ్గించే విధంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల పనితీరు ఉంటుంది.

ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరి ష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్‌్కను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్‌ చేసినట్టు అవుతుంది.  

డివిడెండ్‌ ప్లాన్ల పనితీరును, అవి పంచే డివిడెండ్‌ ఆధారంగా తెలుసుకోవచ్చు. మరి గ్రోత్‌ ప్లాన్ల పనితీరు ఎలా తెలుసుకోవాలి?    – పదమ్‌ దేవ్‌ 
ముందుగా ఒక పథకం డివిడెండ్‌ ఇస్తుంది కదా అని మంచి పనితీరు చూపిస్తుందని అనుకోవడం పొరపాటు. డివిడెండ్‌ ఇచ్చినా కానీ, చెత్త పనితీరు చూపించే అవకాశం లేకపోలేదు. అందుకని ఓ పథకం పనితీరును కచ్చితంగా అంచనా వేయాలంటే అందుకు రాబడులే ప్రామాణికం. వ్యాల్యూ రీసెర్చ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పథకాల పనితీరు గణాంకాలను పరిశీలించుకోవచ్చు. పోటీ పథకాలతో పోలిస్తే మీరు శోధించే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని పొందొచ్చు.

లార్జ్‌క్యాప్‌ పథకం రాబడులను పరిశీలిస్తుంటే దానికి ప్రామాణిక సూచీ నిఫ్టీ లేదా సెన్సెక్స్‌ అవుతుంది. సూచీలతో పోలిస్తే లార్జ్‌క్యాప్‌ పథకం రాబడుల్లో ముందుందా? లేక వెనుకబడిందా తెలుసుకోవచ్చు. ట్రెయిలింగ్‌ రాబడుల కంటే రోలింగ్‌ రాబడులు మరింత కచి్చతంగా ఉంటాయి. ఏడాదికాల రోలింగ్‌ రాబడులు అంటే.. ఏడాది కాల రాబడులను ప్రతీ రోజుకు లెక్కించి సగటు రాబడిని చెప్పడం. గత ఏడాది కాలంలో ఎప్పుడు ఇన్వెస్ట్‌ చేశారన్న దానితో సంబంధం లేకుండా రాబడుల రేటును తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ట్రెయిలింగ్‌ రాబడులు అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇన్వెస్ట్‌ చేస్తే వచి్చన రాబడి. రోలింగ్‌ అంటే.. ఏడాది కాల రాబడులను ప్రతి రోజుకు అన్వయించి చెప్పడం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top