దేశీ ప్రీమియం బైక్స్‌ మార్కెట్‌పై బెనెల్లీ దృష్టి | Benelli Focuses On The Premium Bikes 250-500cc Motorcycle | Sakshi
Sakshi News home page

దేశీ ప్రీమియం బైక్స్‌ మార్కెట్‌పై బెనెల్లీ దృష్టి

Jul 18 2021 11:54 PM | Updated on Jul 19 2021 7:49 PM

Benelli Focuses On The Premium Bikes 250-500cc Motorcycle - Sakshi

ముంబై: ఇటాలియన్‌ సూపర్‌బైకుల తయారీ సంస్థ బెనెల్లీ భారత ప్రీమియం మోటార్‌ సైకిళ్ల మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది చివరిలోగా 250 – 500సీసీ సిగ్మెంట్‌లో మూడు బైకుల విడుదల లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బెనెల్లీ 502సీ పవర్‌ క్రూజర్‌ బైకుల ప్రీ–బుకింగ్స్‌లను ఇటీవలే ప్రారంభించింది. ఈ నెలలో డెలవరీలను చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ప్రీమియం టూ–వీలర్‌ సిగ్మెంట్‌లో 250–500 సీసీ శ్రేణి బైకుల అధిక డిమాండ్‌ ఉన్నందున ఈ విభాగపు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బెనెల్లీ భారత విభాగపు ఎండీ జబాక్‌ తెలిపారు.

ఈ కంపెనీకి చెందిన భారత పోర్ట్‌ఫోలియోలో 500 సీసీ విభాగానికి చెందిన టీఆర్‌కే 502, టీఆర్‌కే 502 ఎక్స్‌తో పాటు లియోన్సినో, 374 సీసీ ఇంపీరియల్‌ అనే మూడు మోడళ్లు ఉన్నాయి. తెలంగాణకు చెందిన మహవీర్‌ గ్రూప్‌కు అనుబంధ ఆదిశ్వర్‌ ఆటో రైడ్‌ సంయుక్త భాగస్వామ్యంలో 2018లో ఒక తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించి తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement