సమ్మె మా కోసం కాదంటూ..’ 10 లక్షల మంది నిరసన

Bank Strike on 16 and 17 December Begin Check Details In Telugu - Sakshi

Bank Unions Strike: సమ్మె నోటీసుకు అనుగుణంగా బ్యాంకు ఉద్యోగులు ఇవాళ, రేపు బంద్‌ పాటించనున్నారు. అడిషనల్‌ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌తో బుధవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కన్‌ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ సౌమ్య దత్త ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగగా.. గురువారం ఉదయం సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడకపోవడంతో బుధవారం ఉదయం నుంచి సమ్మెలోకి దిగాయి బ్యాంక్‌ యూనియన్లు. 

దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు గురు, శుక్రవారాల్లో (డిసెంబర్‌ 16, 17 తేదీలు) బ్యాంకుల సమ్మెలో పాల్గొననున్నారు.  సమ్మె నేపథ్యంలో వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాసహా పలు బ్యాంకులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 


మాకోసం కాదు.. 
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య వేదిక– యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్‌ లాస్‌ సవరణ బిల్లు, 2021)ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కూడా కేంద్రం సిద్ధమవుతోంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమణ ఉంటుందని యూనియన్లు స్పష్టం చేస్తుండగా, అటువంటి హామీ ప్రభుత్వం నుంచి రావట్లేదు.

ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్​ 2021-22లో కేంద్రం నిర్ణయించడం.. ఆ దిశగా ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో.. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు. దీనిపై ముందుగానే సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి.  ఈ సమ్మె తమ కోసం కాదని, బ్యాంకులను ప్రైవేట్‌పరం చేస్తే బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్​లో పడతాయని హెచ్చరిస్తోంది Union Forum Of Bank. మొత్తం తొమ్మిది యూనియన్లు యూఎఫ్‌బీయూ నేతృత్వంలో ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు.

కుట్ర జరుగుతోంది

ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని కోరుతోంది. ఈ దేశంలో సామాన్యులకు సేవలందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వుండడం చాలా అవసరమని పేర్కొంది. 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాతనే పేదలు, అవసరంలో వున్నవారికి బ్యాంకుల సేవలు అందాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తోంది. 1969లో 8 వేలుగా వున్న ప్రభుత్వ రంగ శాఖలు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరాయంటేనే ఎంతగా అభివృద్ధి చెందాయో తెలుస్తోందని. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, నష్టాల్లో నడుస్తున్నాయని చిత్రీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు.. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సమ్మెకు రైల్వే యూనియన్‌ సహా ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి.

ఈ సమ్మెతో స్టేట్‌ బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, యూసీవో బ్యాంక్‌ సహా పలు ప్రైవేట్‌రంగ బ్యాంకుల సేవలకు విఘాతం కలగనుంది. బ్యాంకింగ్‌ సేవలతో పాటు ఏటీఎం, ఇతర సేవలపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ.. నిర్మలా సీతారామన్‌  ఏం చెప్పారంటే.. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top