Automobile Sales Register Double Digit Growth In May Month 2023, See Details Inside - Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ప్యాసింజర్‌ వెహికల్ సేల్స్.. గత నెలలో అమ్మకాలు ఇలా!

Jun 15 2023 6:22 AM | Updated on Jun 15 2023 11:48 AM

Automobile sales register double digit growth in May - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 మే నెలలో హోల్‌సేల్‌లో ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 3,34,247 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 13.54 శాతం అధికమని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపింది. టాటా మినహా యుటిలిటీ వెహికిల్స్‌ 33.5 శాతం పెరిగి 1,55,184 యూనిట్లు నమోదయ్యాయి. టాటా మోటార్స్‌ మూడు నెలలకోసారి అమ్మకాల వివరాలను వెల్లడిస్తోంది. ద్విచక్ర వాహనాలు 17.42 శాతం అధికమై 14,71,550 యూనిట్లు విక్రయం అయ్యాయి. (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

ఇందులో మోటార్‌సైకిల్స్‌ 20.63 శాతం పెరిగి 9,89,120 యూనిట్లు, స్కూటర్స్‌ 12.18 శాతం దూసుకెళ్లి 4,46,593 యూనిట్లకు చేరాయి. త్రీవీలర్లు 28,595 నుంచి 48,732 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి తయారీ కంపెనీల నుంచి డీలర్‌షిప్‌లకు చేరిన వాహనాల సంఖ్య టాటా మోటార్స్‌ మినహా 15,32,861 నుంచి 18,08,686 యూనిట్లకు చేరింది. 2022 మే నెలతో పోలిస్తే గత నెలలో అన్ని వాహన విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు.   (నెలకు లక్షన్నర జీతం: యాపిల్‌ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్‌ ట్వీట్‌)

మరిన్ని  ఇంట్రస్టింగ్‌ కథనాలు, బిజినెస్‌ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement