
ముంబై: దేశ ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త సంవత్సరం శుభారంభం ఇచి్చంది. పలు ఆటో సంస్థలు 2024 జనవరిలో గత సంవత్సరం ఇదే నెలతో పోలి్చతే గణనీయమైన అమ్మకాలు జరిపాయి.
మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా జనవరి అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం అమ్మకాలలో దేశీయ పరిమాణం జనవరిలో 2,78,155 నుండి 3,82,512 యూనిట్లకు పెరిగింది. ఇక ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 102 శాతం పెరిగి 36,883 యూనిట్లుగా ఉన్నాయి.