
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రోనస్ ఫార్మా డీల్‌ను రద్దు చేసుకున్నట్టు అరబిందో ఫార్మా వెల్లడించింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డ్ ఈ మేరకు సమ్మతి తెలిపింది. డీల్ రద్దు విషయమై ఇరు సంస్థలు పరస్పరం అంగీకరించాయని వివరించింది. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్ రీసెర్చ్ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియాలో 51 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్టు ఆగస్ట్ 12న అరబిందో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.420 కోట్లు.