ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు దారులకు బంపరాఫర్‌!

Ather 450 Electric Scooter Available For Rs. 40,000 Less - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కొనుగోలు దారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. ఎథేర్‌ స్కూటర్‌ కొనుగోలు దారులకు ఎక్స్చేంజ్, కార్పొరేట్, ఫెస్టివల్ ఆఫర్లతో పాటు పలు స్కీమ్‌లను అందిస్తున్నట్లు వెల్లడించింది. 

ఈ ప్రత్యేక ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథేర్‌ ప్రో వెర్షన్‌ మోడల్‌ 450 ఎక్స్ (2.9 కిలోవాట్ అండ్‌ 3.7 కిలోవాట్), 450ఎస్ (2.9 కిలోవాట్). మోడళ్లపై రూ .40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 

అయితే, ఈ ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లో వాహనదారుల పాత పెట్రోల్‌ వేరియంట్‌ టూ వీలర్‌, కొనుగోలు చేసి ఎన్ని సంవత్సరాలైంది. బండి కండీషన్‌, కొనుగోలు చేసే సమయంలో దాని ఒరిజనల్‌ ప్రైస్‌ ఎంత ఉందనే దానిని పరిగణలోకి తీసుకుని ఈ భారీ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ఎథేర్‌ ప్రతినిధులు తెలిపారు.  

ఏథర్ 450 ఎస్ ప్రో వెర్షన్‌పై రూ .5,000 ఫెస్టివల్‌ బెన్ఫిట్స్‌, రూ .1,500 కార్పొరేట్ బెన్ఫిట్స్‌ను అందిస్తుంది. మరోవైపు, 450 ఎక్స్ వేరియంట్లు కూడా అదే కార్పొరేట్ స్కీమ్‌ను అందిస్తుంది. చివరగా, ఏథర్ 5.99శాతం వడ్డీ 24 నెలల ఈఎంఐని అందిస్తుంది. ఈ ఫెస్టివల్ ఆఫర్లన్నీ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి.

ఎక్స్చేంజ్ ఆఫర్‌లో గరిష్టంగా రూ.40,000 డిస్కౌంట్, ఇతర స్కీమ్స్ కలిపి ఏథర్ 450 ధరలు గణనీయంగా తగ్గాయి. ఏథర్‌ 450ఎస్ అసలు ధర రూ.1,32,550 నుంచి రూ.86,050కు తగ్గింది. ఏథర్‌ 450 ఎక్స్ 2.9 కిలోవాట్  అండ్‌ 450 ఎక్స్ 3.7 కిలోవాట్ల ధరలు వరుసగా రూ.1,01,050, రూ.1,10,249 (ఢిల్లీలో అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు) గా ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top