Asus Chromebook: మార్కెట్‌లో బాహుబలి ల్యాప్‌ ట్యాప్‌

Asus relese on Chromebook Detachable CZ1   - Sakshi

ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌ లను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అవి పగిలే పోయే అవకాశం ఉంది. కానీ తాజాగా మార్కెట్‌లో విడుదలైన ఆసుస్‌ బాహుబలి ల్యాప్‌ ట్యాప్‌ మాత్రం కింద పడినా పగలదు.ఇందుకోసం ప్రత్యేకమైన ఎక్విప్‌ మెంట్‌ను యాడ్‌ చేసినట్లు ఆసుస్‌ ప్రతినిధులు తెలిపారు. 

తైవాన్‌ ఎల్రక్టానిక్స్‌ దిగ్గజం ఆసుస్‌ తన ప్రాడక్ట్‌ల విడుదలతో ఇండియన్‌ మార్కెట్‌లో సందడి చేస్తోంది. ఈ ఏడాది జులై నెలలో ఆసుస్‌ క్రోమ్‌​బుక్‌ ల్యాప్‌టాప్‌ క్రోమ్‌​బుక్‌ ఫ్లిప్ సీ214, క్రోమ్‌​బుక్‌ సీ423, క్రోమ్‌​బుక్‌ సీ523, క్రోమ్‌బుక్‌ సీ223 విడుదలతో హాట్‌ టాపిగ్గా మారింది. అయితే తాజాగా కింద పడినా డ్యామేజీ అవ్వకుండా ఉండేలా క్రోమ్​బుక్​ డిటాచబుల్​ సీజెడ్​1 (Asus Chromebook Detachable CZ1)ను విడుదల చేసింది.   

ఆసుస్​ క్రోమ్​బుక్​ డిటాచబుల్​ సీజెడ్​1 స్పెసిఫికేషన్స్‌ 
500 గ్రాముల బురువు ఉండే ఆసుస్​ క్రోమ్​బుక్​ డిటాచబుల్​ సీజెడ్​1.. ఇంట్లో వినియోగించే డెస్క్‌, లేదంటే డైనింగ్‌ టేబుల్‌ పై నుంచి కింద పడినా పగలదు. పైగా కింద పడినా ప్రొటెక్ట్‌ చేసేలా నాలుగు వైపుల రబ్బర్‌ ట్రిమ్‌తో వస్తుందని ఆసుస్‌ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ​గూగుల్​ అస్టిస్టెంట్​ వాయిస్ రికగ్నయిజేషన్ తో  వినియోగదారుల్ని అలసరిస్తుండగా..1920x1200 పిక్సెల్స్,​10.1 ఫుల్​ హెచ్​డీ, ఎల్​సీడీ డబ్ల్యూయూఎక్స్​జీఏ టచ్​స్క్రీన్ డిస్​ప్లే, 16:10 యాస్పెక్ట్ రేషియో,100 శాతం ఎస్​ఆర్​జీబీ, 400 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్ పాటు క్రోమ్ ఓఎస్​తో వస్తోంది.   

మీడియాటెక్ కంపానియో 500 (ఎంటీ8183) ప్రాసెసర్, ఆర్మ్​ మాలి-జీ72 ఎంపీ3 జీపీయూ చిప్​సెట్ తో వస్తుండగా 4జీబీ ర్యామ్​, 128 జీబీ ఈఎంఎంసీ స్టోరేజీ చేసుకోవచ్చు. యూఎస్​బీ టైప్​-సీ పోర్టు, 3.5ఎంఎం జాక్​, 1.5ఎంఎం కీట్రావెల్ కీబోర్డు ​తో పాటు టైపింగ్​కు అనువుగా ఉండేలా ఎర్గో లిఫ్ట్​ డిజైన్​తో ఆకర్షిస్తుంది. 8 మెగాపిక్సెళ్ల రేర్​ కెమెరా , 2 మెగాపిక్సెల్​ ఫ్రంట్ కెమెరా, 15 సెకన్ల పాటు చార్జింగ్ చేస్తే 45 నిమిషాల పాటు వినియోగించుకోవచ్చు. 27డబ్ల్యూహెచ్​ఆర్ బ్యాటరీతో వస్తున్నఈ క్రోమ్​బుక్​ను 11 గంటల వరకు నిర్విరామంగా వినియోగించుకునేలా బ్యాటరీ సదుపాయం ఉన్నట్లు ఆసుస్‌ తెలిపింది. ఆసుస్​ క్రోమ్​బుక్ డిటాచబుల్​ అడ్జెస్ట్‌ మెంట్‌ కోసం స్టాండ్​ తో వస్తుండగా..ఈ మోడల్ ధర ఎంతో తెలియాల్సి ఉంది. 

చదవండి : ఆపిల్‌ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top