‘వారెవ్వా..పోయే ప్రాణం తిరిగొచ్చింది’, మహిళ ప్రాణాల్ని కాపాడిన యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌!

Apple Watch Saves Life Again, Detect Blockage In Her Heart - Sakshi

లేటెస్ట్‌ టెక్నాలజీ ఉపయోగించి యూజర్ల ప్రాణాల్ని కాపాడేలా ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కొత్త కొత్త డివైజ్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రాష్‌ డిటెక్షన్‌ అలెర్ట్‌, శాటిలైట్‌ సాయంతో అత్యవసర సేవల్ని అందిస్తుండగా..ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌లలో ఎమర్జెన్సీ, హెల్త్‌ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్న డివైజ్‌లు వినియోగించే యూజర్లు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారిని అప్రమత్తం చేస‍్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కాపాడుతుంది. 

తాజాగా యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచ‌ర్‌తో ఓ మ‌హిళ ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింది. మ‌హిళ‌లో గుర్తించ‌ని హార్ట్ బ్లాకేజ్‌ను యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచ‌ర్ క‌నుగొని అల‌ర్ట్ చేయ‌డంతో ఆమె ప్రాణాల్ని కాపాడుకోగలిగింది.

చదవండి👉 వావ్‌..కంగ్రాట్స్‌ మేడమ్‌.. మీరు గర్భవతి అయ్యారు!!

 యూకేలోని గేట్ హెడ్‌కు చెందిన ఎలిన్ థామ్స‌న్‌కు ఆమె ధరించిన యాపిల్‌ వాచ్‌ నుంచి ఓ అలెర్ట్‌ వచ్చింది. మీ గుండె పనితీరు సరిగ్గా లేదని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఎలిన్‌ థామ్స్‌న్‌ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి జరిగిన విషయం చెప్పింది. ఎలిన్‌ థామ‍్సన్‌ మాటలు విన్న డాక్టర్‌ ఆమెకు ఓ హార్ట్‌ మానిటర్‌ను అమర్చారు. దాని సాయంతో మహిళ హృదయ స్పందనలు ఎలా ఉన్నాయో తెలిసేలా హార్ట్‌ మానిటర్‌లో రికార్డ్‌ ఆప్షన్‌ సెట్‌ చేశారు. వారం రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రికి రావాలని సూచించారు. 

అప్రమత్తం చేసిన యాపిల్‌ వాచ్‌
హార్ట్‌ మానిటర్‌తో ఇంటికి వెళ్లిన ఎలిన్‌కు ఓ రోజు ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే యాపిల్‌ రెడ్‌ అలెర్ట్‌ ఇచ్చింది. మరో రోజు రాత్రి సమయంలో ఎలిన్‌ నిద్రలో ఉండగా.. 19 సెకండ్ల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు హార్ట్‌ మానిటర్‌ ఆస్పత్రికి  హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తమైన వైద్యులు థాంప్సన్‌ వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో ఆమె గుండెలో అడ్డంకులు ఏర్పడినట్లు తేలింది. బాధితురాల్ని ప్రాణాల్ని కాపాడేందుకు గుండెకు ఫేస్‌మేకర్‌(బ్యాటరీతో నడిచే అతి చిన్న డివైజ్‌)ను అమర్చారు.  

యాపిల్‌ వాచ్‌ నా ప్రాణం కాపాడింది
యాపిల్‌ వాచ్‌ తన ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తం చేసింది. కాబట్టే నా ప్రాణాల్ని కాపాడుకోగలిగాను’ అని అన్నారు. వాచ్‌ లేకపోతే అలర్ట్‌ వచ్చేది కాదు. నేను ఆస‍్పత్రికి వెళ్లేదాన్ని కాను. అందుకే ఎల్లప్పుడు వాచ్‌ ధరిస్తున్నా. యాపిల్ వాచ్ అల‌ర్ట్ చేయ‌కుంటే తాను ప్రాణాల‌తో ఉండేదాన్ని కాద‌నే ఆలోచ‌న భ‌య‌పెడుతున్న‌ద‌ని ఎలిన్ గుర్తుచేసుకున్నారు.

2018లో 
2018లో నేను మూర్ఛపోయాను. మూర్ఛపోవడంతో బ్రెయిన్‌ సంబంధిత సమస్యలు తలెత్తాయి. నా కుతురి సలహాతో అప్పటి నుంచి యాపిల్‌ వాచ్‌ ధరించి ఆరోగ్యాన్ని ప్రాణాల్ని కాపాడుకోగలుగుతున్నట్లు తెలిపారు.

చదవండి👉 మీకు హార్ట్‌ ఎటాక్‌ వ‌చ్చింది చూసుకోండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top