Apple iPhone 14 Launched in India: Check Price and Specifications - Sakshi
Sakshi News home page

Iphone 14 And Iphone 14 Plus : ఐఫోన్ 14 సిరీస్ విడుద‌ల..అద‌ర‌గొట్టేస్తున్న ఫీచ‌ర్లు, అవేంటంటే!

Sep 8 2022 4:01 AM | Updated on Sep 8 2022 12:26 PM

Apple iPhone 14 Launched in India: Check Price and Specifications - Sakshi

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 14సిరీస్ ను యాపిల్ విడుద‌ల చేసింది. భారత కాలమానం ప్రకారం..బుధవారం రాత్రి 10.30 గంటలకు 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల‌ను విడుద‌ల చేశారు. వాటిలోని ఐఫోన్ 14 (Iphone 14), ఐఫోన్ 14 ప్లస్‌ (Iphone 14 Plus) ఫోన్ ధ‌ర‌ల‌తో పాటు.. ఈ-సిమ్స్‌,శాటిలైట్ క‌నెక్టివిటీ,యానిమేష‌న్ రూపంలో నోటిఫికేష‌న్ వంటి  ఫీచ‌ర్లు, ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం  

అదిరిపోయేలా ఐఫోన్ 14 ఫీచ‌ర్లు..
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్ల‌స్  మిడ్ నైట్ స్టార్‌లైట్‌, ప‌ర్పుల్‌, రెడ్ వంటి ఐయిదు వేరియంట్‌ క‌ల్స‌ర్‌లో ల‌భ్యం కానుంది. ఈ ఫోన్‌ల‌లో  ఏ15 బయోనిక్ చిప్, 6-కోర్ సీపీయూతో రెండు హై ఫ‌ర్మామెన్స్‌తో నాలుగు ఎఫెషెన్స్ కోర్లు, ఒక న్యూరల్ ఇంజిన్ ఉంది. ఐఫోన్ 14 లార్జ‌ర్ సెన్సార్ల‌తో 12ఎంపీ మెయిన్ కెమెరా, 1.9 మైక్రాన్ పిక్సెల్స్‌, F1.5 ఎప‌ర్చ్యూర్ (కెమెరా హోల్‌) OISతో వస్తుంది.

ఓన్లీ ఈ-సిమ్స్‌
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల‌లో eSIMని పరిచయం చేసింది. త‌ద్వారా ఎక్కువ సంఖ్య‌లో eSIMలను స్టోర్ చేసుకోవ‌డానికి, సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి ఒక్క యూఎస్ ఐఫోన్ 14 సిరీస్‌లో మాత్ర‌మే ఈ ఈ-సిమ్ సౌక‌ర్యం ఉంది. ఎందుకంటే ఆ మోడ‌ళ్ల‌లో ఫిజిక‌ల్ సిమ్ కార్డ్ పెట్టుకునే సిమ్ ట్రేస్‌లు లేవు

శాటిలైట్ క‌నెక్టివిటీ 
యాపిల్ తన ఐఫోన్‌లో మొదటిసారి శాటిలైట్ కనెక్టివిటీని పరిచయం చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 14 వినియోగదారులు ప్రాణ పాయ స్థితిలో ఉన్నా, లేదంటే ఎక్కడైనా చిక్కుకున్నా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ శాటిలైట్ కనెక్టివిటీ సాయంతో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవ‌చ్చు.  గేమ్ ఛేంజ్ టెక్నాలజీని కమ్యూనికేషన్ ప్రవేశపెట్టడానికి తమకు సంవత్సరాలు పట్టిందని యాపిల్ తెలిపింది.

యానిమేషన్ రూపంలోఐఫోన్ 14లో  
ఐఫోన్ 14 చిన్న పిల్ ఆకారపు నాచ్‌తో కొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. డిస్ ప్లే వెనుక భాగంలో ప్రాక్సిమిటీ సెన్సార్, నోటిఫికేషన్‌లు యానిమేషన్ రూపంలో పాప్ అవుట్ అవుతాయి.  

యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్ల‌స్ ధ‌ర‌లు  
ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాల‌ర్లు (సుమారు రూ. 79,900) ఉండ‌గా, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర 899 డాల‌ర్లు (సుమారు రూ.89,900)గా ఉంది. ఈఫోన్‌ల ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతాయి. ఐఫోన్  14 సెప్టెంబర్ 16న, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి అందుబాటులో ఉంటుంది. న‌వంబ‌ర్ నాటికి ఈ ఫోన్‌లు అమెరికా, కెన‌డా కొనుగోలు దారుల‌కు అంద‌నున్నాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement