iPhone 12 Offer In Flipkart: Apple IPhone 12 & IPhone 12 Mini Get Huge Price Cut On Flipkart - Sakshi
Sakshi News home page

ఐఫోన్ 12 కొనేవారికి ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..!

Jan 9 2022 9:01 PM | Updated on Jan 10 2022 9:07 AM

Apple iPhone 12, iPhone 12 mini get huge price cut on Flipkart - Sakshi

మీరు కొత్తగా ఐన్ఫో కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ పేరుతో నిర్వహిస్తున్న సేల్ లో భాగంగా యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మీద భారీ ధర తగ్గింపును ప్రకటించింది. రిటైల్ అవుట్ లెట్ల కంటే చౌక ధరకు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మొబైల్స్ అసలు ధర కంటే ₹19,000 తక్కువకు లభిస్తుంది.

ఆఫర్స్ ఇవే:

  • ఐఫోన్ 12 64 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర ₹ 65,900. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌‌లో ₹53,999 ధరకు లభిస్తుంది. 
  • ఐఫోన్ 12128 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర ₹ 70,900. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌‌లో ₹64,999 ధరకు లభిస్తుంది.
  • ఐఫోన్ 12 మినీ 64 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర ₹59,900. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌‌లో ₹40,999 ధరకు లభిస్తుంది.
  • ఐఫోన్ 12 మినీ 128 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర ₹ 64,900. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌‌లో ₹54,999 ధరకు లభిస్తుంది.

ఫీచర్స్:
డ్యూయల్ సిమ్(నానో + ఈసిమ్) ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ యాపిల్ మొబైల్స్ ఏ14 బయోనిక్ చిప్ సహాయంతో పనిచేస్తాయి. దీనిలో స్పోర్ట్ సూపర్ రెటీనా ఎక్స్డిఆర్ ఓఎల్ఈడి డిస్ ప్లే ఉంది. ఇవి యాపిల్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ తో సంరక్షించబడతాయి. ఐఫోన్ 12 6.1 అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉండగా, ఐఫోన్ 12 మినీలో చిన్న 5.4 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లు ఐఓఎస్ 14తో లాంఛ్ చేసిన 2021లో ఐఓఎస్ 15కు అప్ డేట్ అయ్యాయి. ఈ రెండు మోడల్స్ లో ఒక వైడ్-యాంగిల్ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉన్న 12 మెగా పిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరాలతో వస్తాయి. ఐఫోన్ 12 ఎఫ్/1.6 అపెర్చర్ అయితే, ఐఫోన్ 12 మినీ అపెర్చర్ ఎఫ్/2.4గా ఉంది.మీరు ఎంచుకున్న రంగు, వేరియెంట్ బట్టి ధరలు మారవచ్చని గమనించాలి. ఈ ఆఫర్ ఈ రోజు అర్దరాత్రి వరకు మాత్రమే అవకాశం ఉంది.

(చదవండి: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వర్ డౌన్!)

Advertisement
 
Advertisement
Advertisement