
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025లో ‘హోమ్ఓఎస్’ పేరుతో సరికొత్త స్మార్ట్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ కోసం ఐఓఎస్, యాపిల్ వాచ్ కోసం వాచ్ఓఎస్, ఐప్యాడ్ కోసం ఐప్యాడ్ఓఎస్ వంటి ఎకోసిస్టమ్ పరికరాలకు ప్రత్యేకంగా యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించింది. ఇదే తరహాలో ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం యాపిల్ స్మార్ట్ హోమ్ డివైజ్‌లకు ఉపయోగకరంగా మారనుందని చెబుతున్నారు.
హోమ్‌ఓఎస్‌లోని ఫీచర్లు ఇలా..
కస్టమైజబుల్ హోమ్ స్క్రీన్: ఐఓఎస్ మాదిరిగానే వినియోగదారులు వాతావరణం, స్టాక్స్, రిమైండర్లు.. వంటివాటి కోసం విడ్జెట్లను జోడించవచ్చు.
స్మార్ట్ హోమ్ కంట్రోల్స్: హోమ్ యాప్ ద్వారా లైట్లు, సెక్యూరిటీ, క్లైమేట్ ఇతర యాక్ససరీలను సులభంగా నిర్వహించవచ్చు.
సిరి, యాపిల్ ఇంటెలిజెన్స్: సందర్భానికి తగినట్లు లోతైన అవగాహనతో మెరుగైన వాయిస్ కంట్రోల్‌తో చర్యలు తీసుకోవడానికి సిరిని అనుమతిస్తుంది.
హోమ్ ఆటోమేషన్: నిద్రపోతున్న సమయంలో తలుపులకు తాళం వేయడం, సాయంత్రం అయితే లైట్లు ఆన్ చేయడం లేదా ఇంట్లోకి వచ్చే ముందు మీ ఇంట్లోని ఏసీ, వాషింగ్ మిషన్.. ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను రిమోట్‌గా నిర్వహించడం.
డైనమిక్ రెస్పాన్సిబిలిటీ: సిస్టమ్ యూజర్ ప్రాక్సిమిటీ ఆధారంగా పని చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇంటికి దూరంగా ఉన్నప్పుడు విడ్జెట్‌లు లేదా ఫొటోలను ప్రదర్శించడం ద్వారా వాటిని రిమోట్‌గానే నిర్వహించవచ్చు. సమీపంలో ఉన్నప్పుడు హోమ్ స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు.