Amazon Has Reduced Its Direct Workforce By Nearly 1 Lakh - Sakshi
Sakshi News home page

Amazon: అమెజాన్‌ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు!

Jul 31 2022 8:04 PM | Updated on Jul 31 2022 9:35 PM

Amazon Has Reduced Its Direct Workforce By Nearly 1lakh - Sakshi

ప్రపంచ దేశాల్ని పట్టిపీడిస్తున‍్న ఆర్ధిక మాంధ్యం కారణంగా దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా లక్షలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చరిత్రలో తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు లక్షమంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. 

అమెజాన్‌ వార్షిక ఫలితాల నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ ఒల్సావ్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెజాన్‌లో ఉన్న మొత్తం సిబ్బందిలో 15లక్షమంది ఉద్యోగుల్లో లక్షమందిని విధుల నుంచి తొలగించాం. వారిలో ఫుల్‌ఫిల్‌ మెంట్‌ సెంటర్‌, డిస‍్టిబ్యూషన్‌ నెట్‌ వర్క్‌ ఉద్యోగులపై వేటు వేశారు. సిబ్బందిని తగ్గించడం, నియమించుకోవడం తగ్గిస్తే మంచిదని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. 

 గతేడాది అమెజాన్ 27వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. అదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్‌లో తమ కార్యకలాపాల్ని ముమ్మరం చేసేందుకు క్యూ1లో అనేక మంది ఉద్యోగుల్ని నియమించింది. ఉద్యోగుల విషయంలో సంస్థ పారదర్శకంగా ఉన్నట్లు చెప్పిన బ్రియాన్‌ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ 14వేల మందిని హయర్‌  చేసుకున్నట్లు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement