Amazon- Flipkart: నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్‌-ఫ్లిప్‌కార్ట్‌...! కస్టమర్లకు మాత్రం పండగే...!

Amazon Great India Festival Sale Dates Changed After Flipkart Announces Revised Dates - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌-ఫ్లిప్‌కార్ట్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అమెజాన్‌-ప్లిప్‌కార్ట్‌ సంస్థలు నువ్వానేనా...! అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ తన కస్టమర్ల కోసం బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించిన కొద్ది రోజులకే అమెజాన్‌ ది గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ప్రకటించింది.
చదవండి: వీటిపై ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలే..లాభాలు...!

అమెజాన్‌ తొలుత ది గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభమౌతుందని ప్రకటించగా...ఇప్పుడు ఈ సేల్‌ ఒకరోజు ముందుగానే అక్టోబర్‌ 3నే జరపనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. అంతేకాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ ముందుగానే ది గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంది.ది గ్రేట్‌ ఇండియన్‌  సేల్‌ మాత్రం ఒక నెలపాటు జరగనున్నట్లు తెలస్తోంది. 

బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌ 7 నుంచి ప్రకటించగా..తిరిగి సేల్‌ డేట్‌ మారుస్తూ ఫ్లిప్‌కార్ట్‌ నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 10 వరకు కొనసాగనుంది. దీంతో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరి మధ్య నెలకొన్న పోటీ కస్టమర్లకు లాభం చేకురేలా విధంగా ఉంది.  బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌, అమెజాన్‌ ది గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఎలక్ట్రానిక్స్‌, స్మార్ట్‌ఫోన్‌, మొబైల్‌ యాక్సెరీస్‌, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నాయి. 
చదవండి: ప్రైమ్‌వీడియోస్‌లో డిస్కవరీ ప్లస్‌ ఇంకా మరెన్నో..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top