లగ్జరీ ఉత్పత్తుల్లో వీటిపై అధిక లాభాలు...! | Wine At Top Of The Knight Frank Luxury Investment Index With Prices Up 13 Percent | Sakshi
Sakshi News home page

Knight Frank Luxury Investment Index: లగ్జరీ ఉత్పత్తుల్లో వీటిపై అధిక లాభాలు...!

Sep 25 2021 7:06 PM | Updated on Sep 25 2021 7:07 PM

Wine At Top Of The Knight Frank Luxury Investment Index With Prices Up 13 Percent - Sakshi

Knight Frank Luxury Investment Index: లగ్జరీ ఉత్పత్తులపై పెట్టుబడిపెడితే లాభాలను గడించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తుంటారు. ఒక వేళ ఎవరైనా లగ్జరీ ఉత్పత్తులపై ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తే వైన్‌ ఎక్కువ రాబడులను వచ్చాయని నైట్‌ ఫ్రాంక్‌ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇండెక్స్‌ తన ద్వితీయా త్రైమాసికం 2021 రిపోర్ట్‌లో వెల్లడించింది. తాజా డేటా ప్రకారం....వైన్‌ ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలు ఏడాది కాలంలో 13 శాతం మేర గణనీయంగా లాభాలను పొందినట్లు నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. అరుదైన విస్కీ, లగ్జరీ హ్యండ్‌బ్యాగుల తయారీ సంస్థల కంటే వైన్‌ కంపెనీలు ఎక్కువ  లాభాలను తెచ్చిపెట్టాయని తేలింది. 
చదవండి: Bill Gates: అమెజాన్‌, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్‌...!

ఇటీవలి కాలంలో నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ లో టాప్‌ గెయినర్స్‌గా అరుదైన స్కాచ్‌ బాటిల్స్‌, హెర్మెస్‌ హ్యాండ్‌ బ్యాగుల కంపెనీలు ఏడాది కాలంలో ప్రతికూల వృద్ధిని నమోదుచేసి సూచిక అగ్రస్థానంలో నిలిచాయి. 10 ఏళ్లలో 13శాతం, 119శాతం మేర ధరలు పెరగడంతో జూన్ 2021 చివరి వరకు 12 నెలల్లో వైన్ కంపెనీలు ఇండెక్స్‌ ముందు వరుసలో ఉన్నాయని నైట్ ఫ్రాంక్‌ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ ఎడిటర్ ఆండ్రూ షిర్లీ అన్నారు.

ప్రముఖ వైన్‌ దిగ్గజం బోర్డియక్స్‌ కంపెనీ భారీ లాభాలను గడించింది. 12 నెలల వ్యవధిలో వైన్ ఉత్తమ రాబడులను చూసినప్పటికీ, 10 సంవత్సరాల వ్యవధిలో ఇతర పెట్టుబడుల కంటే ఇది చాలా ఎక్కువ. అరుదైన విస్కీ ​కంపెనీలు 10 సంవత్సరాలలో 483 శాతం రాబడిని నమోదు చేశాయి. లగ్జరీ ఉత్పత్తుల్లో క్లాసిక్ కార్లు, లగ్జరీ వాచీలు వరుసగా 4 , 5 శాతం ధరల పెరుగుదలతో 12 నెలల వ్యవధిలో భారీగా రాబడులను పొందాయి.
చదవండి: ప్యాన్‌కేక్‌ .. ఆ రుచి వెనుక కష్టాల కథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement