జేఈఈ,నీట్‌ కోర్సులు: అమెజాన్‌తో చేతులు కలిపిన శ్రీ చైతన్య

Amazon Academy And Sri Chaitanya Collaboration For Jee,neet - Sakshi

న్యూఢిల్లీ: అమెజాన్‌ అకాడెమీ, విద్యాసంస్థల గ్రూప్‌ శ్రీ చైతన్య తాజాగా చేతులు కలిపాయి. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ), నేషనల్‌ ఎలిజిబిలిటీ–కమ్‌–ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) రాసేవారి కోసం పూర్తి స్థాయి సిలబస్‌ కోర్సులను ఆవిష్కరించనున్నాయి. 

ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్‌ అకాడెమీలో శ్రీ చైతన్య అధ్యాపకులు లైవ్‌ ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తారు. అమెజాన్‌ అకాడెమీ రూపొందించిన బేసిక్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ స్థాయి దాకా కంటెం ట్‌ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ అమోల్‌ గుర్వారా, ఇన్ఫినిటీ లెర్న్‌ (శ్రీ చైతన్య గ్రూప్‌) డైరెక్టర్‌ సుష్మ బొప్పన తెలిపారు.  
 

చదవండి : సిద్ధాంత్‌కు సీటివ్వండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top