గాలి శుభ్రం... తీరేను దాహం

Amazing Invention: Hong Kong Company Product Tap Fresh Converts Air To Purified Water - Sakshi

ఫొటోలో వాటర్‌ డిస్పెన్సర్‌లా కనిపిస్తున్నది ఉత్త వాటర్‌ డిస్పెన్సర్‌ మాత్రమే కాదు, అంతకు మించిన అధునాతన యంత్రపరికరం. వాటర్‌ డిస్పెన్సర్‌ నుంచి నీరు రావాలంటే, అందులో నీరు నింపాల్సిందే! దీనికి ఆ అవసరమే లేదు. ఇది గాలిలోని తేమనే నీరుగా మార్చి సరఫరా చేస్తుంది. అంతే కాదు, గదిలోని గాలిని శుభ్రపరుస్తుంది కూడా! ఇది టూ ఇన్‌ వన్‌ పరికరం. ఎయిర్‌ ప్యూరిఫయర్‌ కమ్‌ వాటర్‌ డిస్పెన్సర్‌.

గదిలోని గాలిలో నిండి ఉండే దుమ్ము ధూళి కణాలను, సూక్ష్మజీవకణాలను పీల్చేసుకుని, గదిలోని గాలిని నిమిషాల్లోనే శుభ్రం చేస్తుంది. గాలిలోని తేమను ఒడిసిపట్టుకుని, నీటిగా మారుస్తుంది. ఇలా ఇది రోజుకు ఇరవై లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. వేణ్ణీళ్లు కావాలంటే వేణ్ణీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లు క్షణాల్లో సరఫరా చేస్తుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుంది. ‘టాప్‌ఫ్రెష్‌’ పేరిట ఒక హాంకాంగ్‌ కంపెనీ రూపొందించిన దీని ధర 399 డాలర్లు (సుమారు రూ.32 వేలు) మాత్రమే! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top