దంపతుల రివెంజ్‌.. ఎయిర్‌బీఎన్‌బీకి భారీ నష్టం!

Airbnb Owner Left With Rs 1.28 Lakh Bill After Guests Leave Taps Running And Gas - Sakshi

 వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీకి భారీషాక్‌ తగిలింది. ఇద్దరు దంపతులు తీర్చుకున్న రివెంజ్‌ దెబ్బతో ఆ సంస్థకు రూ.1.2లక్షల నష్టం వాటిల్లింది. 

వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. చైనాకు చెందిన భార‍్యభర్తలు సౌత్‌ కొరియాలో సియోల్‌లో 25  రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీలో సియోల్‌లో ఓ విల్లాను బుక్‌ చేసుకున్నారు. బుక్‌ చేసుకునే సమయంలో విల్లా యజమాని ‘లీ’(Lee)ని, ఎయిర్‌బీఎన్‌బీని సంప్రదించలేదు. 

అయితే వాళ్లిద్దరూ తాము బుక్‌ చేసుకున్న విల్లా నగరంలో లేదని, ఎక్కడో శివారు ప్రాంతంలో ఉందని తెలుసుకొని కంగుతిన‍్నారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని విల్లా ఓనర్‌ని అడిగారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. చేసేది లేక చైనా నుంచి సియోల్‌కు వచ్చారు. 25 రోజుల పాటు విల్లాలో ఉన్న భార్యభర్తలు విల్లా ఓనర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. 

అనుకున్నదే తడవుగా.. లీ’కి ఫోన్‌ చేసి మీ విల్లాలో నిఘా కెమెరాలు ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా? అడిగారు. అందుకు మా విల్లాలో సీసీ కెమెరాలు లేవని చెప్పడంతో తమ ప్లాన్‌ను అమలు చేశారు. అవసరానికి మించి లైట్లు, ట్యాప్‌లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ ట్యాప్‌లను ఆన్ చేశారు. 25 రోజుల్లో కేవలం ఐదుసార్లు మాత్రమే సియోల్‌ను సందర్శించారు. ఆ ఐదు రోజుల్లో ఐదైదు నిమిషాలు మాత్రమే ఉన్నారు. గడువు ముగియడంతో విల్లాను ఖాళీ చేశారు. 

ఈ క్రమంలో గ్యాస్‌ కంపెనీ అధికారులు విల్లా ఓనర్‌కు లీకి ఫోన్‌ చేశారు. మీ విల్లాలో గ్యాస్‌ వినియోగం ఎక్కువగా ఉందనేది  ఆ ఫోన్‌ కాల్‌ సారాంశం. అధికారులు సమాచారంతో విల్లాలో ఎదైనా ప్రమాదం జరిగిందేమోనని బయపడ్డారు. విల్లాను సందర్శించిన తర్వాత దంపతులు చేసిన పనికి యజమానికి లీ షాక్‌కు గురయ్యాడు. 
 
విల్లాలో ఏం జరిగిందోనని తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో కిటికీలు తెరిచి ఉండడం, గ్యాస్ ఆన్‌లో ఉండడం గమనించాడు. $116 (రూ. 9,506) నీరు, కరెంట్‌ $730 (రూ. 59,824), గ్యాస్ ఇతర $728 (రూ. 59,660) బిల్లులు వచ్చాయి. 120,000 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించారు. భార్య భర్తల ప్రతీకారంతో తమ సంస్థకు భారీ ఎత్తున నష్టం జరిగిందని ఎయిర్‌బీఎన్‌బీ సైతం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తమపై ప్రతీకారం తీర్చుకున్న చైనాలో ఉన్న భార్యభర్తలపై కోర్టును ఆశ్రయిస్తానని, వాళ్లిద్దరూ ఎక్కడున్నా కటకటల్లోకి పంపిస్తానని లీ చెప్పడం కొసమెరుపు.  

చదవండి👉 ఎయిర్‌టెల్‌ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top