Air India New CEO: ఎయిరిండియా కొత్త సీఈవోగా క్యాంప్‌బెల్ విల్సన్‌!

Air India New Boss Campbell Wilson - Sakshi

ఎయిరిండియా సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా క్యాంబెల్ విల్సన్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టాటా సన్స్‌ ప్రకటించింది. 50ఏళ్ల విల్సన్‌కు విమానయాన రంగంలో 26ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్‌ఐఏ) అనుబంధ సంస్థ అయిన స్కూట్‌కు సీఈవోగా పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా విల్సన్‌ను ఎయిరిండియాకు సీఈవోగా నియమించడం పట్ల ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో విల్సన్‌తో  కలిసి చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

ఐకానిక్ ఎయిరిండియా
“ఐకానిక్ ఎయిరిండియాకు నాయకత్వం వహించడానికి, అత్యంత గౌరవనీయమైన టాటా గ్రూప్‌లో భాగస్వామి అవ్వడం గౌరవంగా ఉంది. ఎయిరిండియా ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా అవతరించే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. భారతీయ ఆతిథ్యం ప్రతిబింబించేలా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందిస్తోంది. ఆ ఆశయాన్ని సాకారం చేసే లక్ష్యం దిశగా ఎయిరిండియా, టాటా సహోద్యోగులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది"అంటూ ఎయిరిండియా కొత్త బాస్‌ విల్సన్‌ తెలిపారు.  

 ఆ పిచ్చే ఎయిరిండియా సీఈవోని చేసింది
న్యూజిలాండ్‌లో పుట్టి పెరిగిన  కొత్త ఎయిర్ ఇండియా బాస్ క్యాంప్‌ బెల్ విల్సన్‌ న్యూజిలాండ్‌ కాంటర్‌బరీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా..ఎందుకో మనసు యూరప్‌, అమెరికాపై మళ్లింది.ఆ రెండు దేశాలు తిరిగి స్వదేశమైన న్యూజిల్యాండ్‌కు వచ్చిన ఆయనకు జర్నీలపై పిచ్చి పెరిగింది. ఆ జర్నీ పిచ్చే విల్సన్‌ ఎయిరిండియా సీఈవో అయ్యేందుకు దోహద పడిందనే చెప్పుకోవాలి. ఇక న్యూజిల్యాండ్‌కు తిరిగి వచ్చిన ఆయనకు విమానయాన రంగంపై మక్కువతో సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్‌ఐఏ)లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు దాని అనుబంధ సంస్థ స్కూట్‌కి సీఈవో స్థాయికి చేరుకున్నారు. 
 
అనేక పదవుల్లో చక్రం తిప్పారు
ఏప్రిల్ 1996 నుండి ఎస్‌ఐఏ గ్రూప్‌లో ఉన్న అతను అనేక పదవులు చేపట్టారు. మే 2011లో అంటే స్కూట్‌లో చేరడానికి ముందు సింగపూర్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్‌గా,హాంకాంగ్‌కు ఎస్‌ఐఏ జనరల్ మేనేజర్‌తో పాటు, కెనడా ఎస్‌ఐఏకు వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్‌ఐఏ హెడ్ ఆఫీస్ నెట్‌వర్క్ ప్లానింగ్, నెట్‌వర్క్ రెవెన్యూ మేనేజ్‌మెంట్ విభాగాలలో 3ఏళ్లు విధులు నిర్వహించారు.

విల్సన్ ఎస్‌ఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్‌ అండ్‌, మార్కెటింగ్)గా పనిచేశారు. దీంతో పాటు ధర, పంపిణీ, ఇ-కామర్స్, మర్చండైజింగ్, బ్రాండ్ అండ్‌  మార్కెటింగ్, గ్లోబల్ సేల్స్, ఎయిర్‌లైన్ యొక్క విదేశాల్లో ఉన్న ఎస్‌ఐఏ కార్యాలయాల్ని పర్యవేక్షించారు. ఏప్రిల్ 2020లో స్కూట్ సీఈవోగా పదోన్నతి సాధించారు. ఇప్పుడు ఎయిరిండియా సీఈవోగా ఆ సంస్థ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.

చదవండి👉టాటా ‍గ్రూపుకి షాక్‌! సీఈవో పోస్టు వద్దన్న ఇల్కర్‌ ఆయ్‌సీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top