LIC Share Price: ఏడాదిలో రూ. 1.93 లక్షల కోట్లు ఆవిరి!

After listing LIC lakhs croreloss shares down at 40 pc discount - Sakshi

లిస్టింగ్‌ ధరతో పోలిస్తే షేరు 40 శాతం డౌన్‌.. 

న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ షేర్లు లిస్టయిన ఏడాది వ్యవధిలో 40 శాతం క్షీణించాయి. దీంతో రూ. 1.93 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఎల్‌ఐసీ గతేడాది ఐపీవో ద్వారా రూ. 20,557 కోట్లు సమీకరించి, రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో టాప్‌ 5 విలువైన కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. షేర్లు మే 17న ఇష్యూ రేటుతో పోలిస్తే దాదాపు 8 శాతం డిస్కౌంటుకు బీఎస్‌ఈలో రూ. 872 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ. 867 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ప్రస్తుతం షేరు ఎన్‌ఎస్‌ఈలో 39.93 శాతం క్షీణించింది. బుధవారం రూ. 570 వద్ద ముగిసింది. తొలి ఏడాది ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 920ని,  52 వారాల కనిష్ట స్థాయి రూ. 530.20ని తాకాయి. (ఈ పిక్స్‌ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్‌ ఫ్యాన్స్‌)

గురువారం కూడా  షేరు ధర  మరో 3 శాతం నష్టాల​తో ఉంది. గడిచిన సంవత్సర కాలంలో ఇష్యూ ధరను మాత్రం దాటలేకపోయాయి. ఇదే వ్యవధిలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 13.33 శాతం, నిఫ్టీ 11.82 శాతం పెరిగాయి.    (అయ్యయ్యో! ఐకానిక్‌ స్టార్‌, ప్రిన్స్‌ మహేష్‌, డార్లింగ్‌ ప్రభాస్‌? ఎందుకిలా?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top