ఏసర్ యూజర్లకు భారీ షాక్..!

Acer India Servers Breached, Hackers Claim Over 60GB Data Accessed - Sakshi

ప్రముఖ తైవాన్ టెక్ దిగ్గజం ఏసర్ భారతదేశంలోని తమ సర్వర్లను హ్యాక్ చేసినట్లు దృవీకరించింది. 60జీబీ వినియోగదారుల డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ డేటాను దొంగలించడం ఇది రెండవ సారి. యూజర్ల వ్యక్తిగత సమాచారం, కార్పొరేట్ కస్టమర్ డేటా, సున్నితమైన ఖాతాల సమాచారం, ఆర్థిక డేటాను యాక్సెస్ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. భారతదేశంలోని 10,000 మంది కస్టమర్ల రికార్డులను కలిగి ఉన్న ఫైళ్లు, డేటాబేస్ కూడిన వీడియోను హ్యాకర్ గ్రూపు పోస్ట్ చేశారు. (చదవండి: ఇక మీ ప‌ని అయిపోయిన‌ట్లే.. మేము వచ్చేస్తున్నాం!)

భారతదేశం అంతటా ఏసర్ రిటైలర్లు, పంపిణీదారుల 3,000 సెట్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్ తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని హ్యాకర్ బృందం పేర్కొంది. భారతదేశంలో తన స్థానిక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సిస్టమ్ పై దాడి చేసినట్లు ఏసర్ పేర్కొంది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఏసర్ ధృవీకరించినట్లు నివేదిక తెలిపింది. ఈ విషయం గురుంచి దేశంలోని ఖాతాదారులందరిని అలర్ట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ దాడి గురుంచి స్థానిక అధికారులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఇఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు ఏసర్ పేర్కొంది. ఏడు నెలల్లో ఏసర్ పై జరిగిన రెండో సైబర్ సెక్యూరిటీ దాడి ఇది. మార్చిలో ఆర్ ఈవిల్ చేసిన రాన్సమ్ వేర్ దాడితో కంపెనీ వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకులయి. దొంగిలించిన డేటాను తిరిగి పొందడం కోసం 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని అప్పట్లో ఏసర్ ను హ్యాకర్లు కోరారు. ఆ సమయంలో హ్యాకర్లు డిమాండ్ చేసిన అతిపెద్ద డిమాండ్ అది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top