జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ డివిడెండ్‌ | Abhyuday Jindal reappointed as managing director of Jindal Stainless | Sakshi
Sakshi News home page

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ డివిడెండ్‌

Apr 20 2023 6:11 AM | Updated on Apr 20 2023 6:11 AM

Abhyuday Jindal reappointed as managing director of Jindal Stainless - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌(జేఎస్‌ఎల్‌) ఎండీగా అభ్యుదయ్‌ జిందాల్‌ను కొనసాగించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాకుండా వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు జేఎస్‌ఎల్‌ తెలియజేసింది. ఇందుకు ఈ నెల 26 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది.

మే నెల 17కల్లా డివిడెండ్‌ చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీతో జిందాల్‌ స్టెయిన్‌లెస్‌(హిస్సార్‌) విలీనం తదుపరి ఇది తొలి డివిడెండుగా పేర్కొంది. 2023 మే 1 నుంచి అభ్యుదయ్‌ జిందాల్‌ మరో ఐదేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తాజా ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. మొత్తం డివిడెండు చెల్లింపునకు రూ. 82 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement