7th Pay Commission: డీఏ బకాయిల చెల్లింపు ఎప్పుడు ? ఎంత ?

As per 7th Pay Commission Central Government Employees Will  Get DA From September - Sakshi

సెప్టెంబరు నుంచి వేతనాల పెంపు 

పెంపుతో పాటే డీఏ బకాయిల చెల్లింపు

17 నుంచి 18 శాతానికి పెరగనున్న డీఏ  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న 7వ వేతన ఒప్పందానికి సంబంధించి కీలక సమాచారం అందింది. కరువు భత్యం ఎప్పుడు చెల్లించాలనే అంశంపై కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. 

సెప్టెంబరులో
7వ వేతన ఒప్పందం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం బేసిక్‌పై 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచనున్నారు. అయితే ఈ పెరిగిన డీఏను సెప్టెంబరు నెల జీతంలో కలిసి ఇస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సవరించిన డీఏతోనే కాకుండా గతంలో మూడు దఫాలుగా వాయిదా పడిన డీఏ బకాయిలు, పెన్షనర్లరకు సంబంధించి డీఆర్‌ బకాయిలు కూడా సెప్టెంబరులోనే చెల్లించనున్నట్టు తెలుస్తోంది. 

పెంపు ఇలా ఉండొచ్చు
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం కరువు భత్యానికి సంబంధించి క్లాస్‌ వన్‌ ఆఫీసర్లకి రూ. 11,880 నుంచి రూ. 37,554 వరకు పెరగవచ్చని అంచనా. అదే విధంగా లెవల్‌ 13కి సంబంధించి రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900ల వరకు పెంపు ఉండొచ్చు, లెవల్‌ 14 విషయంలో రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 వరకు ఉండవచ్చు. 

జులై టూ సెప్టెంబర్‌ 
కరోనా సంక్షోభం కారణంగా 2020 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం వాయిదా వేసింది కేంద్రం. మరోవైపు 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, కరువు భత్యం పెంపు తదితర అంశాలపై అనేక సిఫార్సులు చేస్తూ కేంద్రానికి నివేదిక అందించింది. దీంతో జులై1 నుంచి 7వ వేతన ఒప్పందం ప్రకారం పెరిగిన జీతంతో కలిసి డీఏలు చెల్లిస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేంద్రం డీఏ , జీతాల చెల్లింపును మరోసారి వాయిదా వేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top