breaking news
pay commission arrears
-
ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపు ఎప్పుడు? ఎంత ?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న 7వ వేతన ఒప్పందానికి సంబంధించి కీలక సమాచారం అందింది. కరువు భత్యం ఎప్పుడు చెల్లించాలనే అంశంపై కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరులో 7వ వేతన ఒప్పందం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం బేసిక్పై 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచనున్నారు. అయితే ఈ పెరిగిన డీఏను సెప్టెంబరు నెల జీతంలో కలిసి ఇస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సవరించిన డీఏతోనే కాకుండా గతంలో మూడు దఫాలుగా వాయిదా పడిన డీఏ బకాయిలు, పెన్షనర్లరకు సంబంధించి డీఆర్ బకాయిలు కూడా సెప్టెంబరులోనే చెల్లించనున్నట్టు తెలుస్తోంది. పెంపు ఇలా ఉండొచ్చు ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం కరువు భత్యానికి సంబంధించి క్లాస్ వన్ ఆఫీసర్లకి రూ. 11,880 నుంచి రూ. 37,554 వరకు పెరగవచ్చని అంచనా. అదే విధంగా లెవల్ 13కి సంబంధించి రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900ల వరకు పెంపు ఉండొచ్చు, లెవల్ 14 విషయంలో రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 వరకు ఉండవచ్చు. జులై టూ సెప్టెంబర్ కరోనా సంక్షోభం కారణంగా 2020 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం వాయిదా వేసింది కేంద్రం. మరోవైపు 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, కరువు భత్యం పెంపు తదితర అంశాలపై అనేక సిఫార్సులు చేస్తూ కేంద్రానికి నివేదిక అందించింది. దీంతో జులై1 నుంచి 7వ వేతన ఒప్పందం ప్రకారం పెరిగిన జీతంతో కలిసి డీఏలు చెల్లిస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేంద్రం డీఏ , జీతాల చెల్లింపును మరోసారి వాయిదా వేసింది. -
ఏడో వేతన సంఘం.. బకాయిలు వస్తున్నాయి!
కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తున్న ఏడో వేతన సంఘం బకాయిలు (ఎరియర్స్) విడుదల కావడం మొదలైంది. ముందుగా సైన్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. మొత్తం ఎంతమంది డిఫెన్స్ పెన్షనర్లకు బకాయిలు ఇవ్వాల్సి వస్తుందోనన్న లెక్కలు తీస్తున్నారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే లోక్సభకు ఇచ్చిన లిఖిత సమాధానంలో చెప్పారు. అన్నాడీఎంకే ఎంపీ ఎం.వాసంతి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వివరాలు జవాబుగా తెలిపారు. దేశంలో రక్షణ రంగ పెన్షనర్లలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలోనే ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4.21 లక్షల మంది డిఫెన్స్ పెన్షనర్లు ఉన్నట్లు లెక్క తేలింది. కనీస వేతనాలను రూ. 7వేల నుంచి రూ. 18 వేల వరకు పెంచాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేసింది. అయితే, దాన్ని రూ. 26వేలకు పెంచాలని జాతీయ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. మొత్తం 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలైతే లబ్ధిపొందుతారు.