నిమిషానికి 607 కేకులు: ప్రేమికుల రోజు ఎక్కువ ఆర్డర్స్ అక్కడి నుంచే.. | 607 Cakes a Minute Ordered on Swiggy in Valentines Day | Sakshi
Sakshi News home page

నిమిషానికి 607 కేకులు: ప్రేమికుల రోజు ఎక్కువ ఆర్డర్స్ అక్కడి నుంచే..

Feb 16 2025 10:55 AM | Updated on Feb 16 2025 11:46 AM

607 Cakes a Minute Ordered on Swiggy in Valentines Day

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్బంగా.. భారీగా కేక్ ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు అదే ఆల్ టైమ్ రికార్డ్ అని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ 'రోహిత్ కపూర్' వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాలెంటైన్స్ డే రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి.. స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గతంలో ఇప్పటి వరకు పొందనన్ని కేక్స్ ఆర్డర్.. ఆరోజు వచ్చినట్లు పేర్కొన్నారు. నొయిడాకు చెందిన ఒక వినియోగదారు ఏకంగా రూ. 25,335 విలువైన ఆర్డర్ పెట్టారు. ఆర్డర్‌లో థియోస్ నుండి తొమ్మిది కేకులు, ప్రీమియం పాటిస్సేరీ, చాక్లెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా.. ''ప్రేమంటే ఇదే, దానిని పంచుకున్నప్పుడు అది పెరుగుతుంది” అని కపూర్ అన్నారు.

స్విగ్గీ యాప్ నుంచి నిమిషానికి 607 కేక్ డెలివరీ జరిగాయి. అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో కేక్ మిల్క్ చాక్లెట్ ఉంది. బెంగళూరులోనే అత్యధికంగా కేకులు ఆర్డర్ చేసుకున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రేమ వేడుక చాలా మధురంగా ​​ఉందని అన్నారు.

లూథియానా, అమృత్‌సర్, షిల్లాంగ్, నోయిడా, ఆగ్రాలలో వాలెంటైన్స్ డే రోజు ఫుడ్ డెలివరీ ఎక్కువగా జరిగింది. స్విగ్గీ బోల్ట్ తిరుపూర్‌లోని ఎన్ఐసీ ఐస్ క్రీమ్స్ నుంచి 3.4 నిమిషాల్లో ఆర్డర్‌ను డెలివరీ చేసింది. ఈ సందర్భంగా “వేడి వేడిగా ఉంటుంది, చలి చల్లగా ఉంటుంది.. కోరికలు ఎప్పుడూ వేచి ఉండాల్సిన అవసరం లేదు” అని కపూర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement