భారీ రీకాల్.. 2.5 లక్షల వాహనాలు వెనక్కి! | 2 5 Lakh Ford Focus Cars Recalled | Sakshi
Sakshi News home page

భారీ రీకాల్.. 2.5 లక్షల వాహనాలు వెనక్కి!

Jun 13 2026 3:21 AM | Updated on Jun 13 2026 3:21 AM

2 5 Lakh Ford Focus Cars Recalled

అమెరికా ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్.. తాజాగా భారీ స్థాయిలో తన వాహనాలను రీకాల్ ప్రకటించింది. మొత్తం 2.5 లక్షలకు పైగా వాహనాలు ఈ రీకాల్‌ ప్రభావానికి గురయ్యాయి. గతంలో చేసిన రీకాల్‌లో సరిగా మరమ్మతులు చేయకపోవడం వల్ల, మళ్లీ సమస్య తలెత్తినట్లు గుర్తించిన సంస్థ ఇప్పుడు మరోమారు రీకాల్ జారీ చేసింది.

ఈ రీకాల్ ప్రధానంగా 2012 నుంచి 2018 మధ్య తయారైన ఫోర్డ్ ఫోకస్ మోడల్ కార్లకు వర్తిస్తుంది. ఈ వాహనాల్లో ఉన్న కానిస్టర్ పర్జ్ వాల్వ్ లోపం కారణంగా ఇంజిన్ ఆకస్మికంగా ఆగిపోయే అవకాశం ఉంది. డ్రైవింగ్ సమయంలో ఇలాంటి సమస్య అనుకోని సమస్యను తీసుకొస్తుంది. దీనిని పరిష్కరించేందుకు డీలర్లు వాహనాలకు ఉచితంగా పవర్‌ట్రైన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందించనున్నారు. దీని ద్వారా ఇంజిన్ పనితీరును మెరుగుపరచి, అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది.

వాహన యజమానులకు సంబంధించిన నోటిఫికేషన్ లేఖలు జూలై 6 నుంచి పంపించడం మొదలైంది. అంతే కాకుండా.. ఫోర్డ్ వినియోగదారులు ఫోర్డ్ కస్టమర్ సర్వీస్ నంబర్ ద్వారా మరింత సమాచారం పొందవచ్చు. రీకాల్‌కు సంబంధించిన వాహనాల వివరాలు మరియు VIN నంబర్లు జూలై 6 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement