భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం సీతా రాముల కల్యాణం ఘనంగా జరిగింది. తెల్ల వారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశా రు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో కొలువుదీర్చి స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ ఘట్టా న్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం
రామాలయంలో శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి భద్రాచలానికి చెందిన భక్త దంపతులు కె.రామకృష్ణ – వనజ రూ.1,00,116 విరాళం అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: దీపావళి పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజ లు నిర్వహించారు. మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి దీపావళికి తోడు ఆదివారం సెలవు కావడంతో భక్తులు పోటెత్తా రు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. ఈసందర్భంగా అర్చకులు అమ్మ వారికి విశేష పూజలు చేయగా, భక్తులు ఒడిబియ్యం, పసుపు కుంకుమ, చీరలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈఓ ఏ.విజయ్‌కుమార్, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ భక్తులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
క్రికెట్ పోటీలు
రుద్రంపూర్: మందమర్రి ఏరియాలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు కంపెనీ లెవల్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. సింగరేణివ్యాప్తంగా కొత్తగూడెం ఏరియా–కార్పొరేట్, ఇల్లెందు–మణుగూరు, ఆర్జీ–,1,2, భూపాలపల్లి–ఆర్జీ–3, మందమర్రి–బెల్లంపల్లి, శ్రీరాంపూర్ జట్లు పోటీల్లో పాల్గొననున్నాయి. కంపెనీస్థాయి పోటీల్లో ప్రతిభచూపినవారిని వచ్చే జనవరిలో కోలిండియా స్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం సోమవారం వివరాలు వెల్లడించింది.
రేపు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన
భద్రాచలం: దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ బుధవారం భద్రాచలం రానున్నారు. భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిపనులతో పాటుగా గోదావరి పుష్కరాల పనులపై సమీక్షించనున్నారు. పనులను పరిశీ లించనున్నారు. దేవదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు కూడా రానున్నారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఆది, సోమవారాల్లో పర్యాటకులు జలవిహారం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 337మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.17,935, ఆదాయం లభించింది. 150మంది బోటు షికారు చేయగా టూ రిజం కార్పొరేషన్ సంస్థకు రూ.7,600 ఆదా యం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.


