భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి అందాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ ఆదివాసీ గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన దర్బార్‌లో స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఆయా విభాగా ల అధికారులు జాప్యం చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం, కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, తాగునీటి సౌకర్యం, ఉన్నత చదువులకు ఆర్థికసాయం, ఇందిరమ్మ ఇళ్ల మంజూ రు, వ్యక్తిగత రుణాలు, కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్ల ఏర్పాటుకు తోడ్పాటునందించాలని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి పొందేందుకు శిక్షణ కల్పించాలని అర్జీలు సమర్పించా రు. అధికారులు డేవిడ్‌రాజ్, ఆనంద్‌కుమార్, మధుకర్, సైదులు, ఉదయ్‌కుమార్, వేణు, భూక్య గన్యా, మణిదర్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


