సత్తుపల్లిటౌన్: తల్లిదండ్రులు ట్రాక్టర్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ యువకుడు బేతపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు సోమవారం మృతదేహాన్ని గుర్తించారు. దమ్మపేట మండలం సీతారామపురం గ్రా మానికి చెందిన కడెం మనోజ్(20) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా సొంత ట్రాక్టర్ కొనివ్వాలని తండ్రి సురేష్‌ను కోరుతుండగా ఆర్థిక పరిస్థితి కారణంగా ఆయన దాటవేశాడు. దీంతో మనస్తాపానికి గురైన మనోజ్ ఈనెల 6న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే, ఆయన అదేరోజు బేతుపల్లి చెరు వు కళంగి వద్ద దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కాగా, ఈనెల 4వ తేదీ రాత్రి బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల కోసం సిబ్బంది డ్రోన్ కెమెరాతో గాలింపు చేపట్టారు. ఈక్రమాన సోమవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించారు. బయటకు తీశాక వివరాల కోసం సమీప ప్రాంతా ల్లో ఆరా తీస్తుండగా మనోజ్ మృతదేహంగా ఆయన కుటుంబీకులు నిర్ధారించారు. అయితే, మృతదేహం ఉబ్బిపోవడంతో వైద్యులతో అక్కడే పోస్టుమార్టం చేయించామని సత్తుపల్లి సీఐ టి.శ్రీహరి తెలిపారు.
మనస్తాపంతో యువకుడు..
బూర్గంపాడు: మనస్తాపంతో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన బూర్గంపాడులో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన భవానీ గిరీశ్(19) డిప్లొమో ఫెయిల్ అవడంతో తండ్రికి హోటల్ వ్యాపారంలో చేదోడువాదొడుగా ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నాగభిక్షం తెలిపారు.
కుటుంబ కలహాలతో ఒకరు..
బూర్గంపాడు: భార్యాభర్తల నడుమ కలహాలతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మోరంపల్లి బంజరకు చెందిన శనగ సాంబశివరావు(33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంలో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇల్లెందులో వ్యక్తి..
ఇల్లెందురూరల్: మండలంలోని రొంపేడు గ్రామంలో పైడిపల్లి విద్యాసాగర్ (44) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏడాది క్రితం భార్యకు విడాకులిచ్చి ఇల్లెందు పట్టణంలోని స్టేషన్‌బస్తీకి చెందిన చెన్నబోయిన రేణుకను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమైపె అనుమానంతో గత సెప్టెంబర్ 10న హత్య చేశాడు. ఈ కేసులో అరైస్టెన విద్యాసాగర్ రెండు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలై స్వ గ్రామం వచ్చాడు. పండుగ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ సురేష్ తెలిపారు.
బోట్ల కోసం వెతుకుతుండగా
మృతదేహం గుర్తింపు


