చిట్టీల పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో మోసం

Nov 10 2026 12:31 AM | Updated on Nov 10 2026 12:31 AM

ముగ్గురిపై కేసు నమోదు

కొత్తగూడెంఅర్బన్‌: చిట్టీల పేరుతో మోసం చేసిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని న్యూగొల్లగూడేనికి చెందిన కట్టుల సరోజ, కట్టుల చంద్రకళ, కట్టుల కుమా ర్‌ 11 ప్రైవేటు చిట్టీలు నిర్వహిస్తూ పలువురి నుంచి రూ.55,33,745 వసూళ్లు చేశారు. చిట్టీల ద్వారా వసూళ్లు చేసిన డబ్బులను తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు ఫిర్యాదు చేశా రు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి నట్లు డీఎస్పీ తెలిపారు.

గాయానికి ‘కుట్లు’

వేయడంలోనూ నిర్లక్ష్యం!

అశ్వారావుపేటరూరల్‌: ఓ యువకుడి కాలు భాగంలో గాయం కాగా, ఆ గాయానికి కుట్లు వేయడంలోనూ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన విమర్శలకు దారితీసింది. అశ్వారావుపేటకు చెందిన యువకుడు రాజేష్‌ సోమవారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద పనులు చేసే క్రమంలో కాలికి రేకు గుచ్చుకుని గాయమైంది. చికిత్స కోసం ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రికి వెళ్లడంతో, సిబ్బంది గాయానికి మూడు కుట్లు వేసి కట్టుకట్టికి ఇంటికి పంపించారు. ఇంటి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో గాయం నుంచి అధిక రక్తస్రావం కావడంతో కట్టు విప్పి చూస్తే ఆస్పత్రిలో వేసిన కుట్లు ఊడిపోయి కనిపించాయి. ఆందోళన చెంది ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మళ్లీ కుట్లు వేయించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వెళ్లి సిబ్బందిని నిలదీస్తే ఒత్తిడి కారణంగా ఊడిపోయి ఉంటాయని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు బాధితుడు వాపోయాడు.

పోలీసు వాహనం

అడ్డగింత

జూలూరుపాడు(సుజాతనగర్‌): సుజాతనగర్‌ మండలం సింగభూపాలెంలో సోమవారం రాత్రి నిర్వహించిన సదర్‌ ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ డీజే ఏర్పాటుచేయగా, ఎస్‌ఐ కల్యాణి సిబ్బందితో వెళ్లి అనుమతి లేదంటూ అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీ సుల వాహనాన్ని గ్రామస్తులు చుట్టుముట్టారు. ఈమేరకు నిర్వాహకులపై న్యూసెన్స్‌ కేసు నమోదు చేసినట్లు తెలిసింది

జేవీఆర్‌ ఓసీ–2కి

ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

సత్తుపల్లిరూరల్‌: సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీ–2 బొగ్గు గనికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకమైన ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా సత్తుపల్లి ఏరియాలో సోమవారం విజ యోత్సవ సంబురాలు జరుపుకున్నారు. ఏరియా జీఎం వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement