పండుగ పూట విషాదం | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట విషాదం

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

పాల్వంచ: దీపావళి పండుగ రోజు రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం బిల్లూడుతండాకు చెందిన బి.సోమ్లా (40), భార్య సుజాత, ఆమె పెద్దక్క విజయ కలిసి ఆదివారం దీపావళి పండుగ కావడంతో పాల్వంచలోని దేవిజ్యాతండాలో ఉంటున్న విజయ కూతురు మాలోతు సింధు ఇంటికి బయలు దేరారు. సుజాత ముందుగా ఆటోలో వెళ్లింది. బైక్‌పై సోమ్లా, వదిన విజయ వెళ్తున్నారు. అదే సమయంలో బొల్లేరుగూడేనికి చెందిన పైడిపల్లి రంజిత్‌ మరో బైక్‌పై కిన్నెరసాని వైపు నుంచి పాల్వంచ వైపు వస్తున్నాడు. ఈక్రమంలో అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. తీవ్ర గాయాలై సోమ్లా అక్కడికక్కడే మృతి చెందాడు. విజయకు గాయాలు కాగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంజిత్‌కు తీవ్రగాయాలు కాగా, అంబులెన్స్‌ వాహనంలో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పండుగ పూట ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఎస్‌ఐ టి. నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement