పాల్వంచ: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో కేటీపీఎస్ కర్మాగారంలో విద్యుదుత్పత్తి తగ్గిపోయింది. హైడల్ ప్రాజెక్ట్‌ల నుంచి ఉత్పత్తి అధికంగా వస్తుండటంతోపాటు రాత్రి వేళల్లో విద్యుత్ వినియోగం తగ్గుతోంది. దీంతో రాత్రి వేళల్లో కేటీపీఎస్‌లో ఉత్పత్తిని బ్యాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు. 9వ యూనిట్లో 250 మెగావాట్లకు గాను సుమారు 150 మెగావాట్లు, 11 యూనిట్లో 500 మెగావాట్లకు గాను 300 మెగావాట్లు, 12 యూనిట్లో 800 మెగావాట్లకు గాను 700 మెగావాట్లకు ఉత్పత్తి తగ్గించారు. మరో వైపు నాణ్యత లేని బొగ్గు సైతం వస్తుండటంతో యూనిట్లు ట్రిప్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా తక్కువ లోడ్‌తో యూనిట్లను నడుపుతున్నట్లు తెలుస్తోంది.
వార్షిక మరమ్మతులతో
10వ యూనిట్ నిలిపివేత
కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలోని 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10వ యూనిట్‌ను బుధవారం వార్షిక మర్మమతుల కోసం ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. సుమారు 20 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి, అనంతరం ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని సీఈ ఎం.ప్రభాకర్ రావు తెలిపారు. వర్షాల కారణంగా 5వ దశలో 250 మెగావాట్లకు గాను 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.


