పుష్కరాల పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

Nov 5 2026 1:16 AM | Updated on Nov 5 2026 1:16 AM

భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ

భద్రాచలం: రానున్న గోదావరి పుష్కరాల కోసం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని చెప్పారు. భక్తుల రాకపోకలకు అనువుగా ఘాట్ల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సురక్షితమైన తాగునీటి సరఫరాకు పక్కా ప్రణాళిక రూపొందించాలని, భక్తులకు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కర ప్రాంతాల్లో ఆకర్షణీయమైన లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఘాట్లు, పరిసర ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకొని పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీపీఓ అనూష, రామాలయ ఈఓ దామోదర్‌ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement