వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

భద్రాచలం: గిరిజన దర్బార్‌లో అందే వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి బి.రాహుల్‌ ఆదేశించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జరిగిన గిరి జన దర్బార్‌లో ఆయన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అధికారులు తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. అన్ని అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు.

వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ

స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న జనజాతీయ గౌరవ దివస్‌ పక్షోత్సవాల వాల్‌పోస్టర్లను పీఓ రాహుల్‌ అధికారులు, ఆదివాసీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ పక్షోత్సవాల్లో భాగంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, ఆదివాసీ సంస్కృతి, వారసత్వ సంపదను ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఐటీడీఏ ఏపీఓ(జనరల్‌) డేవిడ్‌రాజ్‌, ఎస్‌డీసీ ఆనంద్‌ కుమార్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ చందన, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల అధికారులు మధుకర్‌, సైదులు, గన్యా, ఉదయ్‌కుమార్‌, మనిధర్‌, సున్నం రాంబాబు పాల్గొన్నారు.

గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement