తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

చుంచుపల్లి: ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవి లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందన అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుంచి డిసెంబర్‌ 31వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని, అన్ని ఆవాసాలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని చేతి పంపులు, మో టా ర్ల పనితీరును పరిశీలించి మరమ్మతులు చేపట్టా లని, పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. నీటి ట్యాంకులు, రిజర్వాయర్లను శుభ్రపరచడంతోపాటు క్లోరినేషన్‌, నీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలో బ్లీచింగ్‌ పౌడర్‌ నిల్వలు సిద్ధంగా ఉంచాలన్నారు. మిషన్‌ భగీరథ ఈఈ నళిని మాట్లాడుతూ తాగునీటి సమస్యల పరిష్కారం కోసం మిషన్‌ భగీరథ టోల్‌ఫ్రీ నంబర్‌ 1916పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ విద్యా చందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement