వైభవంగా సీతారాముల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సీతారాముల కల్యాణం

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం సీతా రాముల కల్యాణం వైభవంగా సాగింది. తెల్ల వారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజ లు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో కొలువుతీదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశా రు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.

‘దుమ్ముగూడెం’ వద్ద

పెరుగుతున్న నీటి మట్టం

అశ్వాపురం: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు మిషన్‌ భగీరథ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు చేర్యలు చేపట్టింది. ఇందుకోసమే మండల పరిధిలోని కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు మరో మీటరు పెంచేలా పనులు నిర్వహిస్తోంది. దీంతో గోదావరి నీరు ఆనకట్ట వద్ద దిగువకు రాకుండా ఉంటుంది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతుండగా, ఆనకట్టపై ఇసుక బస్తాలతో ఒక లేయర్‌ పూర్తి చేశారు. రెండో లేయర్‌ పనులు చేపడుతున్నారు. ఇసుక బస్తాలు అడ్డ్డుకట్టగా వేయడంతో ఇటీవల అలుగు పోసిన ఆనకట్ట వద్ద నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వారం, పది రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఆనకట్ట వద్ద టీఎంసీ నీరు నిల్వ ఉండనుంది.

సర్‌ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సర్‌ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధా న ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్‌ ప్రక్రియ పురోగతి, పెండింగ్‌ అంశాలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చేపట్టా ల్సిన చర్యలపై సమీక్షించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ అంకిత్‌ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఎన్నికల సూపరింటెండెంట్‌ రంగ ప్రసాద్‌, నవీన్‌ పాల్గొన్నారు.

ముఖచిత్ర హాజరు నమోదు ట్రయల్‌ రన్‌..

సింగరేణి కొత్తగూడెం ఏరియాలో

పైలట్‌ ప్రాజెక్ట్‌..

కొత్తగూడెంఅర్బన్‌: సాంకేతికత అమలులో ముందుండే సింగరేణి సంస్థ తాజాగా ఉద్యోగుల హాజరు నమోదులోనూ అధునాతన సాంకేతికత అమలు దిశగా చర్యలు చేపట్టింది. పారదర్శకత పెంచడం కోసం ప్రయోగాత్మకంగా కొత్తగూడెం ఏరియాలో ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ (ముఖ చిత్ర నమోదు ఆధారిత హాజరు)ను సోమవారం ప్రవేశపెట్టింది. ఇప్పటికే సింగరేణిలో కొన్ని జీఎం కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం అమల్లో ఉన్నా ఏరియావ్యాప్తంగా గనులు, విభా గాలన్నింటిలోనూ అమలు చేయడం ఇదే ప్రథ మం. ఈ విధానం ద్వారా ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని, సమయపాలన పాటిస్తారని యాజమాన్యం భావిస్తోంది. సింగరేణిలో దాదాపు 40 వేల మంది కార్మికులు ఉండగా కొత్తగూడెం ఏరియాలో సుమారు 1,600 మంది పనిచేస్తున్నారు. కొత్తగూడెంలో పైలట్‌ ప్రాజెక్టుగా ట్రయల్‌ రన్‌ ప్రారంభించింది. మొదటిరోజు ఆటంకాలు లేకుండా హాజరు నమోదు కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఇతర ఏరియాల్లోనూ అమలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement